ఫోన్ కోసం రాత్రిపూట తల్లీకూతుళ్ల గొడవ.. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి..

ABN , First Publish Date - 2020-07-10T17:01:20+05:30 IST

సెల్ ఫోన్ కోసం తల్లీకూతుళ్లు ఘర్షణ పడ్డారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన తల్లి చికిత్స పొందుతూ మరణించింది.

ఫోన్ కోసం రాత్రిపూట తల్లీకూతుళ్ల గొడవ.. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి..

సెల్ ఫోన్ కోసం తల్లీకూతుళ్ల ఘర్షణ..

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం.. 

చికిత్స పొందుతూ తల్లి మృతి


అంబర్ పేట్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సెల్ ఫోన్ కోసం తల్లీకూతుళ్లు ఘర్షణ పడ్డారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన తల్లి చికిత్స పొందుతూ మరణించింది. గోల్నాక జైస్వాల్ గార్డెన్ లో నివసిస్తున్న శ్రీనివాస, నీరజ(39) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె(18), కుమారుడు(14) ఉన్నారు. సెల్ ఫోన్ కోసం ప్రతీరోజూ రాత్రి తల్లీకూతుళ్లు గొడవపడేవారని తెలిసింది. ఈ నెల 8వ తేదీన శ్రీనివాస్ ఊరికెళ్లాడు. ఆ రోజు రాత్రి తల్లీకూతుళ్లు మొబైల్ కోసం గొడవపడ్డారు. కుమార్తెపై ఆగ్రహం వ్యక్తం చేసిన నీరజ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుమార్తె కూడా తాగింది.


ఆందోళన చెందిన శ్రీనివాస్ కుమారుడు అర్ధరాత్రి 12గంటల సమయంలో స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకుని తల్లీకూతుళ్లను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నీరజ గురువారం ఉదయం మరణించింది. ఆమె కుమార్తె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-10T17:01:20+05:30 IST