Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిడ్డ చనిపోయి 10 రోజులు అయినా వదలని తల్లి..

అనంతపురం: ఓ చిన్న వానరం చనిపోయింది. ఆ విషయం తెలిసిన తల్లి వానరం మాత్రం బిడ్డను వదలడంలేదు. ఆ కళేబరాన్ని తనతో పట్టుకుని తిరుగుతోంది. తల్లి మనసు స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. బిడ్డపై ఎంత ప్రేమ పెంచుకుందో ఈ వానరం పిల్ల వానరం చనిపోయినా కూడా మృతదేహాన్ని వదలడంలేదు. తన బిడ్డ చనిపోయిన విషయాన్ని గ్రహించలేక కాదు ఇంకా బతికే ఉందన్న భ్రమలో ఉందా ఆ వానరం. పిల్ల వానరం చనిపోయి 10 రోజులు అయి వాసన వస్తున్నా బిడ్డ మృతదేహాన్ని తల్లి కోతి విడిచి పెట్టడంలేదు. ఎత్తుకుని తిరుగుతోంది. దొరికిన ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కూడా కంట తడి పెట్టుకున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement