నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? : ఎంపీ బాలశౌరి

ABN , First Publish Date - 2021-08-03T07:11:57+05:30 IST

: జాతీయ విద్యా విధానం కింద నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ఏమి చర్యలు తీసుకుంటోందని పార్లమెంటు సమావేశాల్లో బందరు ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు.

నాణ్యమైన విద్య అందించేందుకు   కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి? : ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 2 : జాతీయ విద్యా విధానం కింద నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ఏమి చర్యలు తీసుకుంటోందని పార్లమెంటు సమావేశాల్లో బందరు ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సాయం చేసే ఆలోచన ఏమైనా ఉందని ప్రశ్నించారు. దేశంలోని 15 వేల పాఠశాలల పునరుద్ధరణకు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చిన మేరకు తీసుకుంటున్న చర్యల ఏమిటని ఆయన  కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను  ప్రశ్నించారు. విద్యార్ధులకు ఉచిత విద్య అందించేందుకు, నిర్బంధ ప్రాథమిక విద్య అమలు చేసేందుకు ఏఏ చర్యలు తీసుకుంటున్నారన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాట్లాడుతూ,  అన్ని ప్రభుత్వ పాఠశాలలకు దాదాపు రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశామని, దీనిలో పది శాతం నిధులు పారిశుధ్య చర్యల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల అభివృద్ధికి నాడు - నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలను ఎంపీ బాలశౌరి వివరించారు. 

Updated Date - 2021-08-03T07:11:57+05:30 IST