రూ.4.14 కోట్లతో తాగునీరు

ABN , First Publish Date - 2020-10-25T10:46:25+05:30 IST

మండలంలోని పలు గ్రామాలకు ఎంపీ ల్యాడ్‌ నిధులు రూ.4.14 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పించనున్నట్లు విజయనరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు.

రూ.4.14 కోట్లతో తాగునీరు

విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌


లావేరు, అక్టోబరు 24: మండలంలోని పలు గ్రామాలకు ఎంపీ ల్యాడ్‌ నిధులు రూ.4.14 కోట్లతో తాగునీటి సదుపాయం కల్పించనున్నట్లు విజయనరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు.  పెదరావుపల్లి పంచాయతీ నక్కపేటలో రూ.40ల క్షలతో నిర్మించిన రక్షిత నీటి పథకం, వీధి కొళాయిలను ఆయన శనివారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ, లావేరు మండలానికి తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే రూ.90కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.


ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ, నక్కపేట సమీపంలో పరిశ్రమలు ఉండడంతో గ్రామంలో తాగునీరు కలుషితం అయ్యిందన్నారు. అందుకే తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రక్షిత పథకాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో విశాఖ డెయిరీ డైరెక్టర్‌ ఆరంగి రమణబాబు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు బూరాడ చిన్నారావు, వైసీపీ నాయకులు రొక్కం బాలకృష్ణ, దన్నాన రాజినాయుడు, మీసాల సీతన్నాయుడు, ఆరంగి శ్రీరామూర్తి, శ్రీనివాసరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T10:46:25+05:30 IST