Abn logo
Aug 5 2020 @ 04:52AM

రాజధాని కేంద్రం పరిధిలో ఉండదా....?

ఎంపీ గల్లా జయదేవ్‌


గుంటూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాజధాని కేంద్ర పరిధిలో ఉండదంటూ ఎవరి చెవిలో పూలు పెడతారని ఎంపీ గల్లా జయదేవ్‌ ఓ ప్రకటనలో బీజేపీ, వైసీపీ నేతలను ప్రశ్నించారు. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిని చేసింది కేంద్రమేగా అని గుర్తుచేశారు. జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు రాజధానులను నిర్ణయించింది కేంద్రమా లేక ఆయా రాష్ట్రాలా అని ప్రశ్నించారు.


జమ్మూ కాశ్మీర్‌ను విడతీసినప్పుడు లడక్‌ను రాజధానిగా నిర్ణయించింది కేంద్రమేగా అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అని కేంద్ర గజెట్‌లో ప్రచురించారు కదా అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర పరిధిలోకి రాని రాజధానికి ప్రధాని ఎందుకు శంకుస్థాపనకు వచ్చారని మండిపడ్డారు.  విభజన చట్టం రాసిన కాంగ్రెస్‌ వాళ్లు రాజధాని ఎక్కడో రాసి ఉంటే ఈ దరిద్యం ఉండేదని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement