మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-08-02T06:41:38+05:30 IST

: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ తెలిపారు.

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం

ముదినేపల్లి, ఆగస్టు 1 : గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ తెలిపారు.  బొమ్మినంపాడు గ్రామపంచాయతీ పరిధిలో నాగమ్మ తల్లి ఆలయం వద్ద క్యాంప్‌ బెల్‌ కెనాల్‌పై రూ.10 లక్షల నిధులతో నిర్మిం చిన వంతెనను ఆదివారం  ఆయన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు,  సర్పంచ్‌ దారం సుధ, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి అరుణకుమారిలతో కలిసి ప్రారంభించారు. ఎంపీ కోటగిరి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు మాట్లాడుతూ  వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయటం అభినందనీయమన్నారు.  పంచాయతీరాజ్‌ డీఈఈ సురేష్‌, ఏఈ జె.శ్రీనివాస్‌, వైసీపీ నాయకులు రామిశెట్టి సత్యనారాయణ, బొర్రా శేషు, కరేటి గోవింద రాజులు, శీలం రామకృష్ణ, దాసరి చిరంజీవి, ఆర్‌ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత నాగమ్మతల్లి ఆలయంలో ఎంపీ పూజలు జరిపారు. 

 కాళ్లపాలెంలో సచివాలయ భవనం ప్రారంభం

కలిదిండి  :  కాళ్లపాలెంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుతో కలసి ఎంపీ కోటగిరి శ్రీధర్‌ ప్రారంభిం చారు.  సర్పంచ్‌ పేటేటి స్వర్ణకుమారి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నీలపాల వెంకటేశ్వరరావు, చందన ఉమా మహేశ్వరరావు, అయినాల బ్రహ్మజీరావు, పంచాయతీరాజ్‌ డిఇ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-02T06:41:38+05:30 IST