లేడీ కానిస్టేబుల్ వినతికి సానుకూలంగా స్పందించిన హోం శాఖ.. త్వరలో ఆమె అతడు కాబోతోంది!

ABN , First Publish Date - 2021-12-01T22:29:06+05:30 IST

ఇటీవలి కాలంలో లింగ మార్పిడులు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

లేడీ కానిస్టేబుల్ వినతికి సానుకూలంగా స్పందించిన హోం శాఖ.. త్వరలో ఆమె అతడు కాబోతోంది!

ఇటీవలి కాలంలో లింగ మార్పిడులు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సమాజంలో లింగమార్పిడుల పట్ల పూర్తి సానుకూల ధోరణి రాకపోయినప్పటికీ చాలా మంది తమ జెండర్‌ను మార్చుకునేందుకు వెనకాడడం లేదు. లింగమార్పిడి చేసుకున్న వారు ఉద్యోగాలు కోల్పోయిన ఘటనలు కూడా ఇటీవల చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ ప్రభుత్వ అనుమతితోనే లింగ మార్పిడికి సిద్ధమవుతోంది. 


మధ్యప్రదేశ్‌లోనీ బీడ్‌కు చెందిన 29 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ 2019లో లింగమార్పిడి కోసం హోం శాఖను అనుమతి కోరింది. ఆమెకు చిన్నప్పటి నుంచి జెండర్‌ ఐడెంటిటీ డిజార్డర్‌ సమస్య ఉన్నట్టు ప్రముఖ సైకియాట్రిస్టులు ధ్రువీకరించారు. చట్టపరమైన అన్ని అడ్డంకులు తొలగడానికి రెండేళ్ల సమయం పట్టింది. తాజాగా మధ్యప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖ అమెకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆమె లింగ మార్పిడికి అనుమతినిచ్చింది. ఇలాంటి అనుమతినివ్వడం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఇదే తొలిసారని హోమ్ సెక్రటరీ తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఆమె ఇతర పురుష కానిస్టేబుళ్ల లాగానే విధులు నిర్వర్తించాల్సి ఉంటుందున్నారు.

Updated Date - 2021-12-01T22:29:06+05:30 IST