పేదలకు ఆసరా.. రూ. 1000 పంపిణీ: ఎంపీ

ABN , First Publish Date - 2020-04-05T09:54:04+05:30 IST

పేదలకు ఆసరాగా నిలిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల నగదును పంపిణీ చేస్తుందని ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి తెలిపారు.

పేదలకు ఆసరా.. రూ. 1000 పంపిణీ: ఎంపీ

ఉయ్యాలవాడ, ఏప్రిల్‌ 4: పేదలకు ఆసరాగా నిలిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయల నగదును పంపిణీ చేస్తుందని ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి తెలిపారు. శనివారం ఉయ్యాలవాడలో అర్హులైన వారికి వెయ్యి రూపాయల నగదును పంపిణీ చేశారు.


చాగలమర్రి:  రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డు ఉన్న కుటుంబానికి రూ.1,000 మంజూరు చేసినట్లు ఎంపీడీవో షేక్‌.షంషాద్‌బాను తెలిపారు. శనివారం వలంటీర్లు ఇంటింటికి వెళ్లి కార్డుదారులకు అందజేశారు. 


రుద్రవరం: రుద్రవరం మండలం ఆలమూరులో వైసీపీ నాయకులు సత్యనారాయణ, పత్తి బ్రహ్మయ్య ప్రభుత్వం  అందించిన ఆర్థిక సాయాన్ని కార్డుదారులకు పంపిణీ చేశారు. 


దొర్నిపాడు: మండలంలో రేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారులకు రూ.1,000 నగదును శనివారం వలంటీర్లు ఇం టింటికి వెళ్లి అందజేసినట్లు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం తెలిపారు. 


నంద్యాల: పట్టణంలో శనివారం తెల్ల రేషన్‌ కార్డుదారులకు రూ.వెయ్యి చొప్పున నగదును ఎమ్మెల్యే  శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి పంపిణీ చేశారు. 


బేతంచెర్ల: రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలకు రూ.1000  పంపిణీ చేసినట్లు ఎంపీడీవో అశ్వినికుమార్‌ తెలిపారు.


డోన్‌: ప్రభుత్వం అందిస్తున్న సాయంలో అధికార పార్టీ నాయకుల హంగామా కనిపించింది. వలంటీర్లు అందజే యాల్సిన రూ.1000లను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న  అభ్యర్థులే ఇంటింటికి తిరిగి  పంపిణీ చేశారు. 


మహానంది: ప్రభుత్వం  ప్రకటించిన రూ.1000 ప్రత్యేక ఆర్దిక సాయాన్ని శనివారం  మండలంలో గ్రామ వలంటీర్లు అందజేశారు.


శ్రీశైలం:  తెల్లరేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.1000లను శ్రీశైలం మండలంలో గ్రామ వలంటీర్లు పంపిణీ చేశారు. 


పాములపాడు(వెలుగోడు): పట్టణంలో రేషన్‌ కార్డు దారులకు రూ. 1000లను  సింగిల్‌ విండో చైర్మన్‌ బళ్ళాని సత్యనారాయణ, ఎంపీపీ అభ్యర్థి లాలాం రమే్‌ష అందజేశారు.


కోడుమూరు (రూరల్‌): మండలంలో రూ. 1000 ఆర్థికసాయం పంపిణీ సుమారు 13వేల కార్డుదారులకు పూర్తైనట్లు ఎంపీడీవో మంజులవాణి వివరించారు. మిగిలిన వారికి ఆదివారంలోగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 


Updated Date - 2020-04-05T09:54:04+05:30 IST