కసరత్తు మొదలు

ABN , First Publish Date - 2021-10-02T06:57:25+05:30 IST

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో ఖాళీగా ఉన్న 30 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు కొత్తగా ఓటర్ల జాబితా, అదనపు పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించి అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి ఈనెల 8న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఎటపాక మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఏడాది జూన్‌ 28తో అయిదేళ్ల పాల

కసరత్తు మొదలు

జిల్లాలో 30 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

ఈనెల 12వ తేదీ తర్వాత నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం

8 నాటికి కొత్త ఓటర్ల జాబితా, పోలింగ్‌ స్టేషన్ల డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌

అటు క్రమేపీ పెరుగుతున్న జోడు పదవుల రాజీనామాలు

అనేకచోట్ల పలువురు నేతలు సర్పంచ్‌లు, జడ్పీటీసీలుగా విజయం

ఏదొక పదవి వదులుకోవాల్సి ఉండడంతో త్వరలో వీటికీ ఎన్నికలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఖాళీగా ఉన్న 30 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు కొత్తగా ఓటర్ల జాబితా, అదనపు పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నింటికి సంబంధించి అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి ఈనెల 8న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఎటపాక మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఏడాది జూన్‌ 28తో అయిదేళ్ల పాలన గడువు పూర్తయింది. కానీ అప్పటికే పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌, నామినేషన్లు పూర్తికావడంతో ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పుడు ఈ మండలంలోని అన్ని ఎంపిటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఏకగ్రీవం అయిన తర్వాత పలుచోట్ల నలుగురు ఎంపీటీసీ విజేతలు చనిపోయారు. మరో అయిదింటికి రకరకాల కారణాలతో ఎన్నికలు జరగలేదు. పోలైన ఓట్లకు చెద లు పట్టడంతో మారేడుమిల్లి ఎంపీటీసీ ఎన్నిక నిలిచిపోయింది. 


ఈ నేపథ్యంలో మొత్తం 30 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కొత్తగా సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాని ఎస్‌ఈసీ నిర్ణయించింది. దీంతో ఈఎంపీటీసీ స్థానాల పరి ధిలో కొత్తగా సవరించిన ఓటర్ల జాబితా, ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ స్టేషన్లకు అదనంగా మరిన్ని ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో ఈ ప్రక్రియ ఈనెల 8వ తేదీ నాటికి పూర్తిచేసి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆతర్వాత ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా నోటిఫికేషన్‌ ఈనెల 12 తర్వాత విడుదల కానుంది. మరోపక్క జిల్లాలో అనేకచోట్ల పలువురు ప్రజాప్రతినిధులు సర్పంచ్‌లుగాను, ఆ తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జోడు పదవుల్లో ఏదొక దానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఉదాహరణకు ఏలేశ్వరం, తాళ్లరేవు మండలాల్లో పలువురు సర్పంచ్‌లుగా గెలిచారు. వీరు ఇటీవల ఎంపీటీసీలుగానూ విజయం సాధించారు. కడియపులంక, కోటనందూరులో ఇద్దరు నేతలు సర్పంచ్‌, జడ్పీటీసీలుగా విజయం సాధించారు. ఈనేపథ్యంలో ఏదొక పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఇలా ఖాళీ అయ్యే స్థానాలకు మళ్లీ వచ్చే నెల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2021-10-02T06:57:25+05:30 IST