ఎంఎస్పీ యథాతథం

ABN , First Publish Date - 2020-09-19T07:26:10+05:30 IST

వ్యవసాయ రంగ బిల్లులను ప్రధాని మోదీ పూర్తిగా సమర్థించుకొచ్చారు. ‘కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా ఈ బిల్లులు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)

ఎంఎస్పీ యథాతథం

రైతు నుంచి ప్రభుత్వ సేకరణా ఆగదు

దళారీ వ్యవస్థ నుంచి విముక్తికే..!

కొన్ని శక్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి

వ్యవసాయ రంగ బిల్లులపై మోదీ స్పష్టీకరణ

 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: వ్యవసాయ రంగ బిల్లులను ప్రధాని మోదీ పూర్తిగా సమర్థించుకొచ్చారు. ‘కొంతమంది ప్రచారం చేస్తున్నట్లుగా ఈ బిల్లులు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యవస్థను అంతం చేయవు. వరి, గోధుమ, ఇతర ఆహారధాన్యాలను ప్రభుత్వం  రైతుల నుంచి  కొనుగోలు చేయదన్నది పచ్చి అబద్ధం. ఈ సేకరణ ఎప్పటిమాదిరే కొనసాగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు.\


‘ఇవి చరిత్రాత్మక బిల్లులు. రైతులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కల్పించేవి. రైతులకు రక్షణ కవచంగా నిలిచేవి. ఇన్నాళ్లూ వారు ప్రభుత్వ-అధీనంలోని మార్కెట్‌ కేంద్రాల్లోనే తమ సరుకును విక్రయించుకునే పరిస్థితి ఉండేది. ఇపుడిక అది ఉండదు. ఎక్కడ కావలిస్తే అక్కడ, ఎంత ధరకైనా అమ్ముకోవచ్చు. మధ్య దళారీల బెడద ఉండదు’’ అని వివరించారు.


బిహార్‌లోని కోసీ రైల్‌ మెగా బ్రిడ్జిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతికి అంకితం  చేసిన మోదీ- ఈ బిల్లులపైనే ఎక్కువసేపు మాట్లాడారు. ‘‘కొన్ని శక్తులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఏలినవారే ఇపుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’’ అని కాంగ్రె్‌సపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హోంమంత్రి అమిత్‌ షా కూడా వ్యవసాయ రంగ బిల్లులపై హర్షం వ్యక్తం చేశారు.

కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. షాంఘై సహకార సంస్థ భేటీ తరువాత వారిద్దరూ మాట్లాడుకోవడం ఇదే ప్రథమం. 


Updated Date - 2020-09-19T07:26:10+05:30 IST