టీఆర్పీ స్కామ్: బార్క్ మాజీ సీఈవో బెయిల్‌ పిటిషన్ కొట్టివేత

ABN , First Publish Date - 2021-01-21T04:23:49+05:30 IST

బార్క్ మాజీ సీఈవో, టీఆర్‌పీ స్కామ్ కేసులో కీలక నిందితుడు పార్థో దాస్‌గుప్తా పెట్టుకున్న బెయిల్ ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది...

టీఆర్పీ స్కామ్: బార్క్ మాజీ సీఈవో బెయిల్‌ పిటిషన్ కొట్టివేత

ముంబై: బార్క్ మాజీ సీఈవో, టీఆర్‌పీ స్కామ్ కేసులో కీలక నిందితుడు పార్థో దాస్‌గుప్తా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది. జనవరి 11న టీఆర్పీ కుంభకోణం కేసులో ముంబై పోలీసులు దాస్‌గుప్తాతో పాటు రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖంచందానీ, బార్క్ మాజీ సీవోవో రోమిల్ రాంగర్హియాలపై అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు జనవరి 4న ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టు దాస్‌గుప్తా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. టీఆర్పీ కుంభకోణం కేసులో గతేడాది డిసెంబర్ 30న దాస్‌గుప్తాకు ఎస్ప్లానేడ్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. డిసెంబర్ 24న పుణేలో ఆయన అరెస్ట్ అయ్యారు. కాగా ఇంతకు ముందు పోలీసులు ఖంచందానీని అరెస్ట్ చేయగా తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఇదే కేసులో రిపబ్లిక్ టీవీ ఛానెల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఘన్‌శ్యాం సింగ్‌ అరెస్ట్ అయ్యారు. టీఆర్పీ కుంభకోణం కేసులో మరికొన్ని ఛానెళ్ల పేర్లను కూడా ముంబై పోలీసులు ప్రస్తావించారు. 

Updated Date - 2021-01-21T04:23:49+05:30 IST