ముంబై మునక..

ABN , First Publish Date - 2020-08-05T07:44:11+05:30 IST

ఎడతెరిపిలేని వానలు దేశ ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. 2005 తర్వాత ఇంతటి భారీ వర్షాలు

ముంబై  మునక..

  • ఆర్థిక రాజధాని అతలాకుతలం
  • స్తంభించిన రవాణా
  • గత 15ఏళ్లలో ఇంతటి వర్షం 
  • ఇదే మొదటిసారి
  • వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం.. 
  • పలు రాష్ట్రాల్లోనూ హోరున వానలు

ముంబై, ఆగస్టు 4: ఎడతెరిపిలేని వానలు దేశ ఆర్థిక రాజధానిని అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనం స్తంభించింది. 2005 తర్వాత ఇంతటి భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. ముంపు నీటితో చాలా ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. బయటకు అడుగుపెడితే మళ్లీ ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం లేదు. దీంతో ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ కూడా ముంబైతోపాటు థానే, పుణె, రాయగఢ్‌, రత్నగిరి జిల్లాల్లో రెడ్‌ఎలర్ట్‌ ప్రకటించింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శాంతాక్రజ్‌లోని ఒక ఇల్లు డ్రైనులో కూలిపోయిన ఘటనలో దానితోపాటు ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు ముంపు నీటిలో కొట్టుకుపోయారు. ఒక బాలికను విపత్తు నిర్వహణ సిబ్బంది రక్షించారు. థానేలో కరెంటు స్తంభాన్ని పట్టుకున్న ఒక బాలుడు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. సముద్రంలో ఒక చేపల బోటు మునిగిపోవడంతో ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. ముంబైలోని అత్యవసర సర్వీసులు మినహా లోకల్‌ రైళ్లతోసహా పౌర రవాణాను మొత్తం నిలిపివేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇక, పశ్చిమ తీరం వెంబడి హోరువాన పడుతోంది. కేరళలోని ఇడుక్కి, వాయనాడ్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

Updated Date - 2020-08-05T07:44:11+05:30 IST