orange alert: ముంబైలో నేడు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-07-23T12:57:35+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని...

orange alert: ముంబైలో నేడు భారీవర్షాలు

ముంబై (మహారాష్ట్ర): దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముంబైలో ఆరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ అధికారులు చెప్పారు. ఈ నెల 24, 25 తేదీల్లోనూ ముంబైలో భారీవర్షాలు కొనసాగుతాయని, దీంతో తాము ఎల్లో అలర్ట్ జారీ చేశామని అధికారులు చెప్పారు. గత వారం రోజులుగా భారీవర్షాలు కురుస్తుండటంతో ముంబైలోని పలు లోతట్టుప్రాంతాలు, సిగ్నల్ జంక్షన్లలో వరదనీరు నిలచింది. శాంతాక్రజ్ లో 50.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. 


జులై నెలలో సాధారణ వర్షపాతం 827 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటికే 2,002 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాకాలంలో కురవాల్సిన సాధారణ వర్షపాతంలో 90 శాతం వర్షపాతం ఇప్పటికే నమోదైంది.రైలు పట్టాలపైకి వరదనీరు చేరడంతో ముంబై, కొంకణ్ ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. 51 రైళ్లను రద్దు చేశారు. మరో 35 రైళ్లను దారి మళ్లించారు.ముంబైలోని మొదక్ సాగర్, తన్సా జలాశయాలు వరదనీటితో నిండిపోయాయి. తులసీ జలాశయం పొంగి ప్రవహిస్తోంది. 

Updated Date - 2021-07-23T12:57:35+05:30 IST