Abn logo
Oct 22 2021 @ 08:01AM

Moving Train ఎక్కుతూ జారి పడిన మహిళ...

కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

ముంబై: కదులుతున్న రైలు ఎక్కుతూ జారి కిందపడిన మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ ఉదంతం ముంబైలో తాజాగా వెలుగుచూసింది. ముంబైలోని శాండ్‌హర్స్ట్ రోడ్ రైల్వే స్టేషన్‌లో గురువారం 50 ఏళ్ల ఓ మహిళ మూవింగ్ ట్రైన్ ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడింది. 

కిందపడిన మహిళ రైలు, ప్లాట్ ఫారమ్ మధ్యలోకి జారిపడబోతుండగా సమీపంలో ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సప్నా గోల్కర్ వెంటనే స్పందించి మెరుపు వేగంతో ముందుకు వచ్చి మహిళను పక్కను లాగి రక్షించింది. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సప్నా గోల్కర్ మహిళా ప్రయాణికురాలిని కాపాడిన సీసీటీవీ ఫుటేజీని రైల్వే పోలీసు ఫోర్స్ తాజాగా ట్వీట్ చేసింది. కానిస్టేబుల్ సప్నా గోల్కర్ సాహసోపేతంగా మహిళ ప్రాణాలు కాపాడిందని ఆర్పీఎఫ్ ప్రశంసించింది.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...