Abn logo
Aug 1 2021 @ 01:23AM

ముస్లింలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేయాలి

ఇండియన్‌ ముస్లిం లీగ్‌ డిమాండ్‌

విజయవాడ సిటీ, జూలై 31 : పాదయాత్రలో సీఎం జగన్‌ ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మాటతప్పారని ఇప్పటికైనా వాటిని అమలు చేయాలని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ధర్నాచౌక్‌లో శనివారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ముస్లింలకు దుల్హన్‌ పథకం ద్వారా ఇచ్చే రూ.50వేలను రూ.లక్షకు పెంచుతానని, విదే శీ విద్య పథకాన్ని మరింతమందికి వర్తింపజేస్తానని, డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీ కేంద్రాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ముస్లింలు నమ్మి ఆయనకు ఓట్లు వేశారన్నారు బీజేపీ, ఆరెస్సెస్‌ నేతలే గోవులను వధించి ఎగుమతి చేస్తూ ముస్లింలపై దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధర్నాలో పలువురు ముస్లింనేతలు పాల్గొన్నారు.