Advertisement
Advertisement
Abn logo
Advertisement

విభిన్న ప్రతిభావంతులపై ఆదరణ చూపాలి

ఎర్రగొండపాలెం, డిసెంబరు 3: విభిన్నప్రతిభావంతుల పట్ల ఆదరణ చూపాలని డీఎల్‌డీవో సాయికుమార్‌ అన్నారు. వారిపట్ల చిన్నచూపు చూడొద్దని చెప్పారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎర్రగొండపాలెంలో ర్యాలీ నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు భవ్యకేం ద్రం ఆధ్వర్యంలో ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో పి.ఆంజనేయులు, ఫిజియోథెరపీ డాక్టరు అంకారావు, విభిన్నప్రతిభావంతుల జిల్లా అధ్యక్షుడు గుమ్మా రాజ య్య, సీఆర్‌పీ కోటేశ్వరరావు, ఐఈఆర్‌టీ నాగార్జున, గురు అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 

దివ్యాంగులను అక్కున చేర్చుకోవాలి

మార్కాపురం, డిసెంబరు 3: దివాంగులను అక్కున చేర్చుకోవాలని ఎంఈవో రాందాస్‌ నాయక్‌ అన్నారు. స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపా ధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అందించే సౌకర్యాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్ర మంలో ఉపాధ్యాయులు వీవీ రామిరెడ్డి, జీఎల్‌ రమేష్‌బాబు, వి.ఆంజ నేయులు,  సీహెచ్‌ రజనీ, తదితరులు పాల్గొన్నారు.

ఆట వస్తువుల పంపిణీ

గిద్దలూరు, డిసెంబరు 3: పట్టణంలోని యాదవ బజారులో గల మండలపరిషత్‌ అప్పర్‌ ప్రైమరీ పాఠశాలలో గల భవిత విద్యావనరుల కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు వి ద్యార్థులకు ఆటవస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం బీబీ, ఐఈ రిసోర్స్‌పర్సన్లు ప్రసన్నలక్ష్మి, బాలసిద్దయ్య, పశువైద్యాధికారి డాక్టర్‌ రంగస్వామి, చిన్ని సేవాసంస్థ అధ్యక్షుడు శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పెద్ద దోర్నాల, డిసెంబరు 3 : దివ్యాంగ చిన్నారుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీపీ గుమ్మా పద్మజ అన్నారు. స్థానిక ఎంఈవో కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఎంఈవో బి.మస్తాన్‌ నాయక్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ గుమ్మా పద్మజ, జడ్పీటీసీ లతాభాయి, ఎంపీడీవో ప్రబాకర్‌ శర్మ, దోర్నాల సర్పంచి చిత్తూరి హారిక హాజరయ్యారు.   కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కిశోర్‌ కిరణ్‌ కుమార్‌, శ్రీనివాసులు, షరీఫ్‌, ఉపాధ్యాయులు ఎం.వర్ధన్‌, సరస్వతి, పిజియోథెరపిస్టు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.         

దివ్యాంగులు తమలోని ప్రతిభను కనబర్చి విభిన్న ప్రతిభావంతులుగా ప్రకాశించాలని పెద్దబొమ్మలాపురం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిశోర్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆడిటోరియంలో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్యర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను  శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మజ, సర్పంచ్‌ చిత్తూరి హారిక, గాలె నాయక్‌, దర్శనం పెద్దబాబు, పెరుమాళ్ల గోపాలకృష్ణ, పి.రఘు, తదితరులు పాల్గొన్నారు.

విజయానికి వైకల్యం అడ్డుకాదు

కంభం, డిసెంబరు 3: విజయానికి వైకల్యం అడ్డుకాదని ప్రధానోపాధ్యాయుడు మాల్యాది తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ వైకల్యాన్ని అధిగమించి విజయం సాధిస్తే అది చరిత్ర సృష్టిస్తుందన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో అబ్దుల్‌సత్తార్‌, నూర్జహాన్‌, శారరాదేవి, పర్వీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

నిత్యావసర వస్తువుల పంపిణీ

గిద్దలూరు, డిసెంబరు 3: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక మానసిక వికలాంగుల పాఠశాలకు యువ ప్రగతిపథం స్వచ్ఛంద సంస్థ నెలకు సరిపడ నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులడు సయ్యద్‌ ఫరూఖ్‌, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌, సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈపాఠశాలలో చిన్ని సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాత శేగు మహేష్‌ సమకూర్చిన నిత్యావసర వస్తువులను పాఠశాలకు అందజేశారు. కార్యక్రమంలో చిన్ని సేవాసంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్‌, పాఠశాల ప్రిన్సిపాల్‌ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement