Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకటేశ్వరరావు 

ముగిసిన జిల్లా మహాసభలు 

జిల్లా కార్యదర్శిగా పూనాటి మళ్లీ ఎంపిక


అద్దంకిటౌన్‌, డిసెంబరు 5:  నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజలతో మమేకమై వారి స మస్యలను తెలుసుకుని పోరాడాలని సీపీఎం రా ష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ది శా నిర్దేశం చేశారు. స్థానిక కూకట్ల కన్వెన్షన్‌లో జ రుగుతున్న సీపీఎం 13వ జిల్లా మహాసభలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు జరిగిన సభలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ విస్తరణకు ప్రజా పోరాటాలే పునాదులు కావాలన్నారు. అసంఘటిత రంగం విస్తరిస్తున్నదని, వా రి సమస్యలపై గ్రామ స్థాయిలో పోరాటాలు చే యాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ఈ సందర్భంగా సీపీఎం  కేంద్ర కమిటీ సభ్యుడు వి. శ్రీనివాసరావు పార్టీ విస్తరణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. కాగా మహాసభలలో సీపీఎం తూర్పు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా పూనాటి ఆంజనేయులును రెండోసారి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 21 మందితో జిల్లా కమిటీని ఐగుదురితో కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే జి ల్లాలో ప్రజల ఎదుర్కొంటున్న  37 రకాల సమస్యల మీద మహాసభల్లో తీర్మానాలను ప్రవేశపెట్ట గా వాటిపై చర్చించి ఆమోదించారు.  రెండు రో జుల పాటు జరిగిన జిల్లా మహాసభలను విజయవంతం చేయడానికి సహకరించిన వారందరికీ సీ పీఎం అద్దంకి నియోజకవర్గ కార్యదర్శి గంగయ్య ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో నా యకులు జీవీ.కొండారెడ్డి, ఎస్‌కె.మాబు, చీకటి శ్రీ నివాసరావు, కంకణాల ఆంజనేయులు, కాలం సు బ్బారావు, పి.కల్పన , రఘురాం, రాయని వినోద్‌బా బు, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement