క్రీడా నైపుణ్యంతో జాతీయ స్థాయిలో రాణించాలి

ABN , First Publish Date - 2021-04-19T06:16:34+05:30 IST

క్రీడలలో నైపుణ్యం ప్రతిభను చాటుకుంటున్న క్రీడాకా రులకు విజయం వరిస్తుందని, జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటారని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు.

క్రీడా నైపుణ్యంతో జాతీయ స్థాయిలో రాణించాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

- మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 18: క్రీడలలో నైపుణ్యం ప్రతిభను చాటుకుంటున్న క్రీడాకా రులకు విజయం వరిస్తుందని, జాతీయ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటారని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లో ఈనెల 8నుంచి జరుగుతున్న విజ్జన్న నియోజకవర్గ క్రికెట్‌ పోటీలు ఆదివారంరాత్రి ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడారు. విజేత లతో పాటు నిర్వాహకులు దున్నపోతుల మదు, దేశేట్టి సందీప్‌ తదితరులకు బహు మతులు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, జడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాష్‌రావు, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ సాయిరి మహేందర్‌, కౌన్సిలర్లు ప్రదీప్‌, రాజయ్య, ముస్తాల రవీందర్‌ ,పన్నాల రాములు, రాజలింగం, తిరుపతి, రఫీ, రాజు నాయకులు కిషోర్‌, సతీష్‌, శ్రీనివాస్‌ రావు, చందు, రజనీకాంత్‌, మోబిన్‌, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T06:16:34+05:30 IST