పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరచాలి

ABN , First Publish Date - 2021-04-20T04:42:41+05:30 IST

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థినులు ప్రతిభ కనబరచాలని సర్వశిక్షా ఏపీసీ పైడి వెంకటరమణ కోరారు. సోమవారం ఆయన జలుమూరు, పోలాకి కేజీబీవీలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, దానిపై ఆరా తీశారు. భోజనాల సమయంలో విద్యార్థినులందరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరచాలి
జలుమూరులో భోజనాలను పరిశీలిస్తున్న సర్వశిక్షా అభియాన్‌ ఏపీసీ వెంకటరమణ

సర్వశిక్షా ఏపీసీ పైడి వెంకటరమణ

జలుమూరు/పోలాకి, ఏప్రిల్‌ 19: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థినులు ప్రతిభ కనబరచాలని సర్వశిక్షా ఏపీసీ పైడి వెంకటరమణ కోరారు. సోమవారం ఆయన జలుమూరు, పోలాకి కేజీబీవీలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, దానిపై ఆరా తీశారు. భోజనాల సమయంలో విద్యార్థినులందరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. జిల్లాలో ఉన్న 32 కేజీబీవీల్లో తాగునీటి సదుపాయం కల్పించామన్నారు. పోటీతత్వంతో చదవాలని సూచించారు.  బాత్‌ రూమ్‌లు, మరుగుదొడ్లు, భోజనాల గదిని ప్రతీరోజు ఫినాయిల్‌తో కడిగించాలని సిబ్బందికి ఆదేశించారు. జలుమూరు పాఠశాల ఆవరణలోని బోరును నేటివరకు బాగుచేయించక పోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారి వాన సుజాతను ఆదేశించారు. ప్రభుత్వం కొవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినప్పటికీ వసతి గృహంలో పదో తరగతి బాలికలకు తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని ఉపాధ్యాయులంతా విధిగా పాఠశాలకు హాజరుకావాలన్నారు.  సంక్షేమాధికారి ఎం.సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-20T04:42:41+05:30 IST