ఉరుకులు పరుగులు

ABN , First Publish Date - 2020-11-28T05:35:37+05:30 IST

జిల్లాలోని పాఠ శాలల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన నాడు – నేడు పను లను త్వరితగతిన ముగించేందుకు జిల్లా యంత్రాంగం మూడు రోజుల గడువు విధించింది.

ఉరుకులు పరుగులు

నాడు–నేడు పనులకు 3 రోజులే గడువు

సామగ్రి కొనుగోళ్లలో హెచ్‌ఎంలు.. ఎంఈవోల తలమునకలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 27 : జిల్లాలోని పాఠ శాలల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన నాడు – నేడు పను లను త్వరితగతిన ముగించేందుకు జిల్లా యంత్రాంగం మూడు రోజుల గడువు విధించింది. తొలి విడతగా ఎంపికైన 211 ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కారణాల వల్ల 10 నుంచి 20 శాతం పనులు పూర్తి కాలేదు. తుది విడత నిధులు విడుదలైనప్పటికీ నిర్దేశిత పనులు పూర్తి చేయకపోవడంతో ఇప్పటికే కొందరు ఎంఈవోలు, హెచ్‌ ఎంలకు జిల్లా విద్యా శాఖ షోకాజు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే అసంపూర్తిగా మిగిలిన పనుల ను పూర్తి చేసేందుకు ఈ నెలాఖరు వరకు తుది గడువు ఇచ్చింది. పలుచోట్ల ఇసుక, కార్మికుల కొరతతోపాటు టాయిలెట్లకు అవసరమైన శానిటరీ సామగ్రి ఇంత వర కూ అందకపోవడంతో పాఠశాలల్లో నాడు–నేడు పనులు పూర్తి కాలేదని ఎంఈవోలు, హెచ్‌ఎంలు చెబుతున్నారు. ఈ సమస్య నివారణకు మధ్యేమార్గంగా మిగిలిన పనుల కు ఏదైనా సామగ్రి కొనుగోలు చేయాల్సి ఉంటే ఈ నెల 30లోగా కొనుగోలు చేసి వాటి బిల్లులను సీఎస్‌ఈ నాడు – నేడు వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులు ఆదే శించారు. గడువులోగా సామగ్రిని కొనుగోలు చేసి వాటి బిగింపు/నిర్మాణ పనులు తరువాత చేయించుకునేలా వెసులుబాటు కల్పించారు. కొనుగోళ్లు జరిపి బిల్లులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోతే నిధులను నిలిపివేస్తూ సమగ్ర శిక్ష డీఈ లాగిన్‌ను క్లోజ్‌ చేయనున్నారు. ఆ తదు పరి నిధుల విడుదల కోసం జాయింట్‌ కలెక్టర్‌ (అభి వృద్ధి)ను నేరుగా కలిసి ఎంఈవోలు, హెచ్‌ఎంలు అభ్య ర్థించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మెటీరియల్‌ కొనుగోళ్ల కోసం ఎంఈవోలు, హెచ్‌ఎంలు పరుగులు తీస్తున్నారు. 

Updated Date - 2020-11-28T05:35:37+05:30 IST