వ్యాక్సిన్ వేసేందుకు భుజాన్ని తాకిన నర్సు... మెలికలు తిరిగిన కానిస్టేబుల్!

ABN , First Publish Date - 2021-03-09T18:01:46+05:30 IST

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ ముమ్మరంగా...

వ్యాక్సిన్ వేసేందుకు భుజాన్ని తాకిన నర్సు... మెలికలు తిరిగిన కానిస్టేబుల్!

కోహిమా: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో నాగాలాండ్‌లోని ఒక వ్యాక్సినేషన్ సెంటర్‌కు చెందిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం ఒక పోలీసు టీకా కేంద్రానికి వచ్చాడు. అతనికి టీకా ఇచ్చేందుకు నర్సు అతని భుజాన్ని తాకగానే... ఆమె స్పర్శకు అతను ఒక్కసారిగా మెలికలు తిరిగిపోతూ నవ్వుల్లో మునిగిపోయాడు. 


దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాని క్యాప్షన్‌లో... ఇది నాగాల్యాండ్‌లోని కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్ కు సంబంధించిన వీడియో. ఇంతకీ అతనికి టీకా వేశారో లేదో తెలియదు గానీ, అతను ఎందుకు అలా నవ్వుతున్నాడో అర్థం కావడం లేదు. సూది మందు ఇవ్వకుండానే మెలికలు తిరిగిపోతూ హంగామా చేస్తున్నాడు’ అని రాశారు. 

Updated Date - 2021-03-09T18:01:46+05:30 IST