Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎమ్మెల్యే రోజాకు రోజాలతో సత్కారం

చిత్తూరు జిల్లా: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఏం చేసినా సంచలనమే. మొన్నటికి మొన్న డప్పు కొట్టి వార్తల్లో నిలిచారు. మళ్లీ నిన్న రోజాకు రోజాలతో పూలాభిషేకం చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. తట్నేరి దళితవాడ రోడ్డును ఆమె ప్రారంభించారు. జగనన్న కాలనీలో గృహనిర్మాణం కోసం నిరుపేదలైన లబ్దిదారులకు వైఎస్సార్ క్రాంతి పథకం ద్వారా ఒక్కోక్కరికి రూ. 30 వేలు పంపిణీ చేశారు. దీంతో స్థానిక నాయకులు రోజాకు రోజాలతో పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు.

Advertisement
Advertisement