టీఆర్‌ఎస్‌ గెలిస్తే నాగార్జునసాగర్‌ అభివృద్ధి

ABN , First Publish Date - 2021-04-14T06:15:32+05:30 IST

సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ గెలిస్తేనే సాగర్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌ గెలిస్తే నాగార్జునసాగర్‌ అభివృద్ధి
గుర్రంపోడులో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌యాదవ్‌

పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

గుర్రంపోడు/హాలియా/తిరుమలగిరి(సాగర్‌)/నాగార్జునసాగర్‌/, ఏప్రిల్‌ 13: సాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ గెలిస్తేనే సాగర్‌ అభివృద్ధి సాధ్యమవుతుందని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మండలంలోని ఆమలూరులో మం గళవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పిం ఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం గ్రామీణ కులవృత్తులను ప్రోత్సహిస్తోందన్నారు. ఓటమి పాలైన అనం తరం  జానారెడ్డి నియోజకవర్గం వైపు చూడలేదన్నారు. ఉప ఎన్నికలో పోటి చేసి ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారని విమర్శించారు. పలు గ్రామాల కు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్‌, లోడంగి గోవర్దన్‌, సర్పంచులు జక్కల భాస్కర్‌, విజయ్‌, బాల మల్లయ్య, చంద్రమౌళి తదితరులు ఉన్నారు. హాలియాలోని టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఈదయ్య ఇంట్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు ఆనందంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రసాద్‌నాయక్‌, వర్రా వెంకట్‌రెడ్డి, మురళి, దుర్గారావు, కాశయ్య పాల్గొన్నారు. తిరుమలగిరి(సాగర్‌) మండలం ఎర్రచెరువు తండాలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ సమక్షంలో మాజీ సర్ప ంచ్‌ రమావత్‌ బిక్షానాయక్‌తోపాటు కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల నెల్లికల్లు లిప్టు పనులను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కార్య క్రమంలో మాజీ ఎంపీటీసీ రమావత్‌ బీలునాయక్‌, రమావత్‌ జోగా నాయక్‌, రమావత్‌ పాండునాయక్‌, బాలునాయక్‌, బంగి, రామరాజు, బిచ్చ ఉన్నారు. తిరు మలగిరి(సాగర్‌) కోనేటిపురం శివారులో గుట్టపై తిరుమలనాధ ఆలయంలో  జరిగిన పూజల్లో మంత్రి గుంటకండ్ల జగదీ ష్‌రెడ్డి పాల్గొన్నా రు. ఆయన వెంట హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆలయ చైర్మన్‌ బుర్రి రాంరెడ్డి ఉన్నారు. ఈ ప్లవనామ సంవత్సరంలో రాష్ట్ర, జిల్లా ప్రజలు అన్ని విధాలుగా క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు సుధీర్‌, గోపాల్‌ సాగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ 25వేల ఓట్ల మోజారిటీతో గెలుస్తారని అన్నారు. కార్యక్రమంలో సందీప్‌, సిద్దు యా దవ్‌, కిరణ్‌, చక్రవర్తి, శ్రీధర్‌, తదితరులు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నాయ కుడు దూదిమెట్ల బాలరాజుయాదవ్‌ నాగార్జున సాగర్‌లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జితేందర్‌, ప్రజాపతి, సైదులు, చంద్రమౌళి నాయక్‌, పుల్లయ్య, నడ్డి సైదులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-14T06:15:32+05:30 IST