నాగ్‌పూర్‌లో ఆందోళనకరంగా పెరిగిపోతున్న కరోనా కేసులు.. మరణాలు

ABN , First Publish Date - 2021-04-12T00:15:20+05:30 IST

మహారాష్ట్రలో కరోనా మరోమారు ఆందోళనకరస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు

నాగ్‌పూర్‌లో ఆందోళనకరంగా పెరిగిపోతున్న కరోనా కేసులు.. మరణాలు

నాగ్‌పూర్: మహారాష్ట్రలో కరోనా మరోమారు ఆందోళనకరస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా నాగ్‌పూర్‌ జిల్లాలో గత 24 గంటల్లో ఏకంగా 7,201 కేసులు వెలుగుచూశాయి. అలాగే, 63 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. గత 24 గంటల్లో 3,240 మంది కరోనా కోరల నుంచి బయటపడినట్టు నాగ్‌పూర్ సివిల్ సర్జన్ పేర్కొన్నారు.


తాజా కేసులతో కలుపుకుని జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,78,556కి చేరుకుంది. 2,17,313 మంది కోలుకున్నారు. 5,769 మంది మృతి చెందారు. జిల్లాలో ఇంకా 55,474 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. కొవిడ్‌తో బాధపడుతున్న వారికి అత్యవసరంగా ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత జిల్లాను వేధిస్తోంది. 


ఈ నేపథ్యంలో నాగ్‌పూర్‌కు చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సన్ ఫార్మా చీఫ్‌ దిలీప్ సంగ్వికి ఫోన్ చేసి 10 వేల రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను నాగ్‌పూర్ పంపాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ వెంటనే 5 వేల ఇంజక్షన్లు, మరో మూడు రోజుల్లో మిగతా మూడువేల ఇంజక్షన్లు పంపిస్తానని హామీ ఇచ్చారు.  

Updated Date - 2021-04-12T00:15:20+05:30 IST