భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

ABN , First Publish Date - 2022-08-03T04:18:56+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాగుల పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని కేశ్లాపూర్‌ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని నాగసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి దంప తులు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
రెబ్బెనలో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌టౌన్‌/చింతలమానేపల్లి/పెంచికలపేట/బెజ్జూరు/దహెగాం /కౌటాల/సిర్పూర్‌(టి)/కెరమెరి/రెబ్బెన/వాంకిడి/జైనూరు/సిర్పూర్‌(యూ) ఆగస్టు 2: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నాగుల పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంలోని కేశ్లాపూర్‌ ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలోని నాగసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి దంప తులు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పలు ఆలయాల్లో, కాలనీలలో వెలసిన పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పోశారు.  కాగజ్‌నగర్‌లోని  ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతలమానపల్లి మండల వ్యాప్తంగా మహిళలు పుట్టల్లో పాలు పోశారు. పెంచికలపేట మండలంలోని ఆలయాల్లో  మహిళలుప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టల్లో పాలు పోశారు.  బెజ్జూరు మండలంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దహెగాం మండలంలో ఆలయాల్లో భ్రక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌటాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో  నాగుల చవితి వేడుకలు నిర్వహించారు. సిర్పూర్‌(టి) మండలంలో నాగుల పంచమి వేడుకల సందర్భంగా మహిళలు పుట్టల వద్ద పూజలు చేశారు. కెరమెరి మండల వ్యాప్తంగా మహిళలు పుట్టల వద్ద పూజలు చేశారు. రెబ్బెన మండల వ్యాప్తంగా ఆలయాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాంకిడి మండలంలో మహిళలు ఉపవాస దీక్షలు చేపట్టి పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. 62ఎఎస్‌ఎఫ్‌2: నాగ దేవతకుపూజలు చేస్తున్న భక్తులు జైనూరు మండల కేంద్రంతో పాటు మారుమూల గ్రామాల్లో మహిళలు పూజలు చేశారు. సిర్పూర్‌(యూ)మండలంలోని కేస్లాపూర్‌లోని నాగోబా దేవతకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2022-08-03T04:18:56+05:30 IST