Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేద్కర్‌కు నివాళులర్పించిన నారా లోకేశ్‌

అమరావతి: అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సమానత్వమే నిజమైన అభివృద్ధి అని చాటిచెప్పిన మహనీయుడని, భార‌త ప్ర‌జాస్వామ్య‌గ‌ణ‌తంత్రానికి దీప‌ధారి అంబేద్క‌ర్ అని కొనయాడారు. దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు ఉండ‌టంకాదని, స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం దేశ ప్రజలందరికీ అందించ‌డ‌మే అస‌లైన అభివృద్ధి అని చెప్పిన మహనీయులని లోకేశ్ అన్నారు.

Advertisement
Advertisement