వీవీ రామారావును పరామర్శించిన నారాయణ

ABN , First Publish Date - 2021-07-30T04:37:09+05:30 IST

తీవ్ర అనారోగ్యంతో సెవెన్‌హిల్స్‌ ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు వి.వి. రామారావును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పరామర్శించారు.

వీవీ రామారావును  పరామర్శించిన నారాయణ
కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న నారాయణ

తీవ్ర అనారోగ్యంతో సెవెన్‌హిల్స్‌లో చికిత్స పొందుతున్న కామ్రేడ్‌

విశాఖపట్నం, జూలై 29: తీవ్ర అనారోగ్యంతో సెవెన్‌హిల్స్‌ ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్న ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు వి.వి. రామారావును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పరామర్శించారు. గురువారం విశాఖ వచ్చిన నారాయణ ఆస్పత్రికి వెళ్లి రామారావు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, ఇతర నాయకులు ఆదినా రాయణ,జి.ఓబులేసు,ఆర్‌.రవీంద్రనాథ్‌,ఎం.పైడిరాజు,జె.రామకృష్ణ ఉన్నారు. 

Updated Date - 2021-07-30T04:37:09+05:30 IST