బాల శాస్త్రవేత్తకు.. జాతీయ పురస్కారం

ABN , First Publish Date - 2021-12-07T05:02:18+05:30 IST

‘కాస్ట్‌ రోప్‌ మేకింగ్‌ మెషీన్‌’ను రూపొందించి ఉత్తమ ప్రతిభను కన బరిచిన కైకరం జడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని మారిశెట్టి దుర్గామంగకు జాతీయ పురస్కారం దక్కింది.

బాల శాస్త్రవేత్తకు.. జాతీయ పురస్కారం
విద్యార్థినిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ఉంగుటూరు, డిసెంబరు 6 : ‘కాస్ట్‌ రోప్‌ మేకింగ్‌ మెషీన్‌’ను రూపొందించి ఉత్తమ ప్రతిభను కన బరిచిన కైకరం జడ్పీ హైస్కూల్‌ విద్యార్థిని మారిశెట్టి దుర్గామంగకు జాతీయ పురస్కారం దక్కింది. 2019–20 విద్యా సంవత్సరానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌  నిర్వహించిన ఇన్‌స్ఫైర్‌ మనక్‌లో దేశవ్యాప్తంగా విద్యార్థులు నాలుగు లక్షల ప్రాజెక్టులను రూపొందించారు. ఇందులో 60 ప్రాజెక్టులు జాతీయస్థాయిలో ఎంపి కయ్యాయి. వీటిలో ఒకటి గైడ్‌ (ఉపాధ్యాయుడు) కూనాతి జాన్‌ ఆధ్వర్యంలో తయారుచేసిన కాస్ట్‌ రోప్‌ మేకింగ్‌ ప్రాజెక్టు. ఈ నెల 3న బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో జరిగిన కార్యక్రమంలో మంగకు రూ.7,500 విలువైన ల్యాప్‌ ట్యాప్‌తో పాటు ట్రోఫీని ఎన్‌ఐఎఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విపిన్‌కుమార్‌, ఇస్రో శాస్త్రవేత్త పీఎస్‌ గోయల్‌ అందజేశారు. ప్రాజెక్టుపై మంగకే పేటెంట్‌ రైట్‌ ఇచ్చినట్లు డీఈవో రేణుక, హెచ్‌ఎం టీవీ రామకృష్ణ తెలిపారు.  


Updated Date - 2021-12-07T05:02:18+05:30 IST