Abn logo
Sep 1 2021 @ 08:36AM

సెప్టెంబరు 11న జాతీయ లోక్‌ అదాలత్‌

బాపట్ల: సెప్టెంబరు 11న జరుగుతున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో వీలైనన్ని సివిల్‌, క్రిమినల్‌, ప్రీ లిటిగేషన్‌ కేసులు రాజీఅయ్యేలా పోలీసుశాఖ వారు న్యాయ సేవాధికార సంస్థ కలిసి పనిచేయాలని బాపట్ల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి డి. వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ ఈ విషయంలో కక్షిదారులలో చైతన్యం వచ్చేలా అధికారులు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి అన్నామణి, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.