ప్రకృతి కన్నెర్ర

ABN , First Publish Date - 2021-10-11T06:55:40+05:30 IST

అందరికీ అన్నం పెట్టే అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈయేడు వానాకాల సీజన్‌లో రైతులకు అపారనష్టం జరుగుతోంది. జిల్లా లో కురుస్తున్న అధిక వర్షాలకు ఆనంద పడాలో, లేక బాధపడాలో అర్థంకాని పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారు.

ప్రకృతి కన్నెర్ర

జిల్లాలో రైతులను వెంటాడుతున్న ప్రకృతి వైపరీత్యాలు

ఈయేడు పిడుగుపాటుకు 14 మంది మృతి

అప్పుల బాధతో మరో 34 మంది రైతుల బలవన్మరణం

బాధిత కుటుంబాలకు అందని పరిహారం

ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల డిమాండ్‌ 

ఆదిలాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): అందరికీ అన్నం పెట్టే అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈయేడు వానాకాల సీజన్‌లో రైతులకు అపారనష్టం జరుగుతోంది. జిల్లా లో కురుస్తున్న అధిక వర్షాలకు ఆనంద పడాలో, లేక బాధపడాలో అర్థంకాని పరిస్థితుల్లో అన్నదాతలు ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1048.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా అధికం గా 1599.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు వెనుదిరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించినా అకాల వర్షాల కారణంగా అన్నదాతల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ యేడు వానాకాల సీజన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా 14 మంది రైతులు పిడుగు పాటుకు గురై అకస్మాత్తుగా మరణించారు. అలాగే అప్పుల బాధతో మరో 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. శనివారం ఆకస్మాత్తుగా కురిసిన పిడుగుల వర్షానికి జిల్లాలో ఒకే రోజు గంట వ్యవధిలోనే ముగ్గు రు రైతులు పంట చేనులోనే ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. మరెన్నో పశువులు పిడుగు పాటుతో ప్రాణాలు విడిచాయి. ఇంత జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్లు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాల్లో బరోసా నింపే కనీస ప్రయత్నం చేయడం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 

       రైతుల్లో భయాందోళనలు..

జిల్లాలో కురుస్తున్న ఉరుములు, మెరుపులు, పిడు గుల వర్షాలతో అన్నదాతలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ కొద్దిగా ఆకాశం మేఘావృతమెనా ఎప్పు డు ఎక్కడ నుంచి పిడుగులు వచ్చిపడుతాయోనన్న భయం రైతులను వెంటాడుతోంది. వ్యవసాయ పను లు చేసుకుంటూనే ఆకాశం వైపు బిక్కు బిక్కుమంటూ చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం కొంత ఆకాశం నిర్మలంగానే కనిపిస్తున్నా.. మధ్యా హ్నం, సాయంత్రం వేళల్లోనే ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఇలాం టి పరిస్థితుల్లో పనులను వదిలేసి రైతులు ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో చేతికి వచ్చిన సోయా, పత్తి, పెసర పంటలను నష్ట పోవాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. పిడుగు వర్షాలతో నిత్యం భయంగానే వ్యవసాయ పనులు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట నష్టంతో పాటు ప్రాణనష్టం జరుగుతున్నా సంబంధిత అధికారులు రైతుల్లో అవగాహన కల్పించి భరోసా నింపడం లేదు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తేనే కొన్ని ప్రాణాలైన కాపాడుకునే అవకాశం ఉంటుందని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. 

       పరిహారం కోసం ఎదరు చూపులు.. 

ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందిం చే పరిహారం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. కనీసం బాధిత కుటుంబాలను పలుకరించి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేయడం లేదు. భూమిని కలిగి ఉండి 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న రైతులకు రైతు బీమా పథకం వర్తిస్తున్నా మిగతా రైతుల పరిస్థితి అధ్వానంగా మరుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో పిడుగు పాటుకు గురై 14 మంది మృతి చెందగా ఇందులో నలుగురు మహారాష్ట్ర వలసకూలీలు ఉన్నా రు. ప్రస్తుతం పత్తిపంట సీజన్‌ కావడంతో మహారాష్ట్ర నుంచి వందలాదికూలీ కుటుంబాలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాయి. ఏదో కూలీ కోసం వచ్చిన కుటుంబాల్లో పిడుగుల వర్షాలు విషాదాన్ని నింపుతున్నాయి. రైతులు ఏ కారణం చేతైన చనిపోతే రైతు బీమా పథకం కింద ప్రభుత్వం రూ.6 లక్షలను అందిస్తుంది. కానీ జిల్లా మృత్యువాత పడుతున్న మహారాష్ట్ర కూలీలకు అక్కడి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోక పోవడంతో బాధిత కుటుంబాల పరిస్థితి మరీ అధ్వానంగా మారుతోంది. అసలు నిబంధనల ప్రకారం వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా మృతి చెందిన రైతు కుటుంబాలకు జీవో 2 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.6లక్షల పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఈ యేడు పిడుగు పాటుకు గురైన ఏ ఒక్కరికి ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందించలేదు.

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి..

ఫ సంగెపు బొర్రన్న 

(రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు)

ప్రకృతి వైపరీత్యాలతో ప్రాణాలు కోల్పోయిన బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలి. రైతు బీమా వర్తింపచేసినట్లుగానే జిల్లాలో మరణించిన మహారాష్ట్ర వలస కూలీ కుటుంబాలను సైతం ఆదుకోవాలి. ఈ యే డు పిడుగు పాటుతో మృతి చెందిన 14 మంది రైతుల్లో నలుగురు మహారాష్ట్ర కూలీలే ఉన్నారు. ఇప్పటివరకు జిల్లా అధికారులు బాధిత కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు. కొంత మంది దాతలు సాయం చేస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోవడం లేదు.

Updated Date - 2021-10-11T06:55:40+05:30 IST