9 నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి.. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త.. చివరకు..

ABN , First Publish Date - 2022-06-23T00:03:05+05:30 IST

అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు కనీసం తాగడానికి నీరు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు..

9 నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి.. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త.. చివరకు..

అస్సాంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వస్తుండడంతో అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు కనీసం తాగడానికి నీరు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో కడుపుతో ఉన్న భార్యను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ముఖ్యమంత్రికి మెయిల్ చేశాడు. ‘‘దయచేసి 9నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి’’ అంటూ వేడుకున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో చివరకు ఏం జరిగిందంటే..


అస్సాం రాష్ట్రం సిల్చార్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. బరాక్ నది వెంబడి ఉన్న బేతుకండి కరకట్ట వద్ద తెగిపోవడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. రాత్రికి రాత్రే పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రంగీర్‌ఖారీ కనక్‌పూర్ రోడ్ రాధామాధవ్ బునియాడి పాఠశాల స్కూల్ సమీప ప్రాంతంలో వరద నీరు ముంచెత్తింది. ఈ ప్రాంతంలో ఉంటున్న నిరుపమ్ దత్తా పురక్యస్థ అనే వ్యక్తి భార్య 9నెలల గర్భంతో ఉంది. వరద నీరు ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కడుపుతో ఉన్న భార్యను రక్షించేందుకు నిరుపమ్ ఎన్నో రకాలుగా ఆలోచించాడు. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక చివరికి.. జూన్ 21 ఉదయం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈమెయిల్ చేశాడు. “దయచేసి నా 9 నెలల గర్భిణి భార్యకు సహాయం చేసి రక్షించండి. పరిస్థితి విషమంగా ఉంది, తాగడానికి కనీసం నీరు కూడా లేదు లేదు.. ఒక రెస్క్యూ బోట్ ఏర్పాటు చేయండి” అంటూ వేడుకున్నాడు.

ఒకే రోజు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి.. తెల్లారినా ఆ ఇళ్లల్లో తలుపులు తీయకపోవడంతో స్థానికులు వెళ్లి చూస్తే..


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. కాచర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి తన ట్విటర్ ఖాతా ద్వారా సిబ్బందికి సూచనలు చేశారు. చిరునామాను తెలియజేస్తూ.. గర్భిణిని వెంటనే రక్షించండి.. అంటూ ఆదేశించారు. అయితే వరద నీరు కారణంగా అంబులెన్స్‌లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని ఆమెను పడవలో సురక్షిత ప్రదేశానికి తరలించారు. వరదల కారణంలో కొండచరియలు విరిగిపడడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో మంగళవారం భువనేశ్వర్ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు హెలీకాప్టర్లలో అక్కడికి చేరుకున్నాయి. అలాగే ఎస్‌డిఆర్‌ఎఫ్, పారా మిలటరీ, ఇతర భద్రతా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

రూ.28 చిల్లర కోసం గొడవ.. ఆటో వెంట పడుతూ ప్రాణాలు కోల్పోయిన టెకీ.. ఆరేళ్ల తర్వాత రూ.43 లక్షల పరిహారం..



Updated Date - 2022-06-23T00:03:05+05:30 IST