Abn logo
Sep 18 2020 @ 19:18PM

కరోనా వ్యాక్సిన్‌‌పై కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ కీలక ప్రకటన

Kaakateeya

న్యూఢిల్లీ: మానవ జీవనశైలినే మార్చేసిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోవిడ్ వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. 3 వ్యాక్సిన్లు ఫేజ్ 1, 2, 3 క్లినికల్ దశల్లో ఉన్నాయని, మరో నాలుగు ప్రీ క్లినికల్ దశలో ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్‌కు సంబంధించి ఎయిమ్స్ హెల్త్ కమ్యూనిటీ మెడిసిన్ శాఖకు చెందిన డాక్టర్ సంజయ్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ ఫేజ్ 2 క్లినికల్ దశలో ఉందని, దాదాపు 600 మందికి పైగా వాలంటీర్లపై ప్రయోగం జరిగినట్లు డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా, రాకపోయినా 2021 మధ్య సమయం నాటికి జన జీవనం మళ్లీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అప్పటికీ వ్యాక్సిన్ రాని పక్షంలో మాస్క్‌లు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement