115 శాంపిల్స్‌లో నెగిటివ్‌ ఫలితాలు

ABN , First Publish Date - 2020-04-09T12:01:06+05:30 IST

కరోనా వైరస్‌కు సంబంధించి మరో 115 శాంపిల్స్‌లో నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. ఈ మేరకు బుధవారం రాత్రి కాకినాడ నుంచి ఫలితాల

115 శాంపిల్స్‌లో నెగిటివ్‌ ఫలితాలు

సిటీ న్యూస్ : కరోనా వైరస్‌కు సంబంధించి  మరో 115 శాంపిల్స్‌లో నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. ఈ మేరకు బుధవారం రాత్రి కాకినాడ నుంచి ఫలితాల వివరాలు జిల్లా అధికారులకు అందాయి.  మరో 27 శాంపిల్స్‌  ఫలితాలు కాకినాడ నుంచి రావాల్సి ఉందని అదన పు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి  జగన్నాథరావు తెలిపారు. 


ఎన్‌జీవోలు భాగస్వాములు కావాలి

కరోనా వైరస్‌ నియంత్రణలో స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీవో)లు భాగస్వాములు కావాలని జేసీ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఎన్‌జీవోలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటు వంటి లాభాపేక్షను ఆశించకుండా సేవాభావంతో పనిచేసే సంస్థలు ఎన్‌ జీవోలని కొనియాడారు. జిల్లాలో పౌష్టికాహారం అందించాల్సిన చిన్నారులు, మానసిక వికలాంగులు, వృద్ధులు, కూలీలు, యాచకులు చాలామంది ఉన్నారన్నారు. వీరం దరికీ ఆహారం అందించా ల్సి ఉందని చెప్పారు.


అలాగే క్వారంటైన్‌లో ఉన్నవారికి కూడా సేవలు అందించాల్సి ఉంటుందన్నారు.  మండలాల వారీగా కమిటీలను వేసి  బాధ్యతలను అప్పగిస్తామన్నారు. అక్షయ పాత్ర ద్వారా నియోజక వర్గాల వారీగా మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 3వేల మందితో ప్రారంభించి 20వేల మందికి భోజనం పంపిణీ చేసేందుకు నిర్ణయించి నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌వో దయానిధి, సీపీవో మోహనరావు, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ జగన్మోహన రావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T12:01:06+05:30 IST