జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-06-03T09:41:16+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ జర్నలిస్టులు మంగళవవారం నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం

(ఆంధ్రజ్యోతి- నల్లగొండ/సూర్యాపేట/యాదాద్రి) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ జర్నలిస్టులు మంగళవవారం నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రాలు అందజేశారు. ప్లకార్డులతో తమ డిమాండ్లను ప్రదర్శించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని, ముఖ్యంగా ఇళ్లు, ఇళ్ల స్థలాల విషయంలో నిర్లక్ష్యంగా చేస్తోందని దుయ్యబట్టారు.


నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పి.ప్రభాకర్‌రెడ్డి. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గార్లపాటి కృష్ణారెడ్డి, మారబోయిన మదుసూధన్‌, సంఘం రాష్ట్ర నాయకులు కోటగిరి దైవాదీనం, ప్రెస్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్‌రెడ్డి, సూర్యాపేట నిరసనలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, ఐజేయూ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు మిక్కిలినేని శ్రీనివా్‌సరావు, కుర్ర రవికుమార్‌, తుంగతుర్తిలో టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు శంకరమంచి రవీందర్‌శర్మ, వీరమల్లు, హుజూర్‌నగర్‌లో టీయూడబ్ల్యూజె జిల్లా ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు, శేషంరాజు, నరే్‌షగౌడ్‌, అడ్డగూడూరులో ఐజేయూ మండల ప్రధాన కార్యదర్శి మారోజు మల్లయ్యచారి, బాలకృష్ణ, వెంకన్న, శివ, మనోహర్‌రెడ్డి, భువనగిరిలో అమరుల స్థూపానికి వినతిపత్రం అందజేశారు. టీయూడబ్లుజే(ఐజేయూ)రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-03T09:41:16+05:30 IST