నెల్లూరు: సంజు కోసం కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2021-07-08T16:32:16+05:30 IST

అడవిలో అదృశ్యమయ్యాడని భావిస్తున్న మూడేళ్ల బాలుడు సంజు కోసం గాలింపు కొనసాగుతోంది.

నెల్లూరు: సంజు కోసం కొనసాగుతున్న గాలింపు

నెల్లూరు:  అడవిలో అదృశ్యమయ్యాడని భావిస్తున్న మూడేళ్ల బాలుడు సంజు కోసం గాలింపు కొనసాగుతోంది. సమీప గ్రామాలు, అటవీ ప్రాంతాన్ని పోలీసులు, గ్రామస్థులు జల్లెడపట్టినా బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. వారం రోజులు గడుస్తున్నా బాలుడి జాడ లేకపోవడంతో సంజు జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.  సంజు అదృశ్యమైన ముందు రోజు సంచార కుటుంబాలు గ్రామానికి వచ్చాయి. వారేమైనా బాలుడిని ఎత్తుకెళ్లి ఉంటారనే అనుమానాలు బలపడుతున్నాయి. వారిని ట్రేస్ చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-08T16:32:16+05:30 IST