Viral Video: మీకు ఉదయాన్నే నిద్ర లేవాలంటే బద్ధకమా..? అయితే ఈ బెడ్ మీద ఒక్కసారి పడుకుని చూడండి..
ABN , First Publish Date - 2022-09-09T20:57:14+05:30 IST
బద్ధకం (laziness).. బద్ధశత్రువని తెలిసినా చాలా మంది దాని నుంచి బయటపడలేక సతమతమవుతుంటారు. ఆఖరికి రోజు వారి పనులు సమయానికి చేయడానికి కూడా..
బద్ధకం (laziness).. బద్ధశత్రువని తెలిసినా చాలా మంది దాని నుంచి బయటపడలేక సతమతమవుతుంటారు. ఆఖరికి రోజు వారి పనులు సమయానికి చేయడానికి కూడా బద్ధకిస్తుంటారు. ఇక కొందరైతే మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇక విద్యార్థులు, యువకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మందికి ఉదయాన్నే లేవాలంటే బద్ధకం.. చదవాలంటే బద్ధకం.. ఇక రేపు పరీక్షలనగా ఒకటే కంగారుపడిపోతుంటారు. వాయిదా వేయడం అలవాటుగా చేసుకుంటూ.. తీరా సమయం దగ్గరపడగానే హడావుడి పడిపోతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో అలారం బెడ్ (Alarm bed) వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఉదయాన్నే లేవాలంటే బద్ధకించే వారికి.. ఈ బెడ్ సరిగ్గా సరిపోతుంది. ఎంత మొద్దు నిద్రలో ఉన్నా.. నిద్ర మత్తు వదిలే వరకూ ఎత్తిపడేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter Viral Videos) అవుతోంది. ఉదయం అవుతున్నా ఓ బాలుడు పడుకునే ఉంటాడు. అతన్ని నిద్రలేపేందుకు తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బంది పడకుండా.. చక్కని ఐడియా వేశారు. మామూలు అలారం అయితే లేవడనుకున్నారో ఏమోగానీ.. ఏకంగా అలారం బెడ్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఫిక్స్ చేసిన సమయం రాగానే ఒక్కసారిగా బెడ్.. పైకి, కిందకు కుదిపేస్తుంది. దెబ్బకు ఆ బాలుడు ఉలిక్కిపడి లేస్తాడు. ఎంత పడుకోవాలని ట్రై చేసినా సాధ్యం కాదు. చివరకు చేసేదిలేక.. బెడ్ కిందకు దిగి, అలారం ఆఫ్ చేస్తాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బద్ధకస్తులకు బ్రహ్మాండమైన బెడ్ అంటూ కొందరు, వావ్ సూపర్ బెడ్ అంటూ మరికొందరు, అర్జంట్‌గా ఈ బెడ్ కావాలంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.