ఈమె చీర ఏంటీ మరీ ఇంత విచిత్రంగా ఉంది.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-02-09T00:29:41+05:30 IST

వినూత్నంగా ఆలోచించి చేసే వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ధరించిన చీరను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు...

ఈమె చీర ఏంటీ మరీ ఇంత విచిత్రంగా ఉంది.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కొందరు వింత వింత ఐడియాలతో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నారు. మరికొందరైతే రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోతుంటారు. వినూత్నంగా ఆలోచించి చేసే వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ ధరించిన చీరను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. వీటితో కూడా చీరను తయారు చేయొచ్చా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ వినూత్నంగా ఆలోచించి చీరను తయారు చేసింది. వీడియోలో ఆమె మొదటగా ఓ చిప్స్ ప్యాకెట్‌ను చూపిస్తుంది. తర్వాత సీన్ కట్ చేస్తే.. తళుక్కుమనే చీరతో దర్శనమిస్తుంది. అయితే అది నూలుతో కాకుండా చిప్స్ ప్యాకెట్స్‌తో చేయడంతో హాట్‌టాపిక్ అయింది. చీర అంచుగా ప్యాకెట్ పైభాగాన్ని, మిగతా మొత్తం ప్యాకెట్ లోపలి భాగంతో తయారు చేసింది. చూడటానికి ఆకట్టుకునేలా చేయడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఐడియా అదుర్స్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పగిలిపోయిన 10 రూపాయల టీ కప్పు.. పేలిన తూటా.. ఆస్పత్రి పాలయిన భర్త..!



Updated Date - 2022-02-09T00:29:41+05:30 IST