మీ ఇంటి కిటికీ కూడా ఇలాగే ఉందా.. అయితే ఇల్లు గుళ్లవడం ఖాయం.. వైరల్ అవుతున్న వీడియో

ABN , First Publish Date - 2022-01-20T00:16:50+05:30 IST

కొన్నిసార్లు దొంగల తెలివితేటలు చూసి పోలీసులు కూడా షాక్ అవుతుంటారు. ఇటీవల ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఇంట్లోకి దొంగ ప్రవేశించిన తీరు చూస్తే.. అవాక్కవడం మాత్రం ఖాయం..

మీ ఇంటి కిటికీ కూడా ఇలాగే ఉందా.. అయితే ఇల్లు గుళ్లవడం ఖాయం.. వైరల్ అవుతున్న వీడియో

ప్రస్తుతం దొంగలు తెలివి మీరిపోయారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా నాయనా.. అనేలా దొంగల ప్రవర్తన ఉంటోంది.  వినూత్నంగా ఆలోచిస్తూ చోరీలకు పాల్పడడం ఇటీవల తరచూ చూస్తూనే ఉన్నాం. కొన్ని చోరీలు చూస్తే వామ్మో.. అంటూ షాక్ అయ్యేలా ఉంటాయి. కొన్నిసార్లు దొంగల తెలివితేటలు చూసి పోలీసులు కూడా షాక్ అవుతుంటారు. ఇటీవల ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఇంట్లోకి దొంగ ప్రవేశించిన తీరు చూస్తే.. అవాక్కవడం మాత్రం ఖాయం.


ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ.. తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూస్తే.. వెంటనే అంతా తమ ఇళ్ల కిటికీలను చెక్ చేసుకోవడం మాత్రం ఖాయం. దొంగల అతి తెలివికి అద్దం పట్టేలా ఈ వీడియో ఉంది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి ఏమాత్రం కష్టపడకుండా దొంగ వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారి.. అతడి చోరీ నైపుణ్యతను ప్రదర్శించమంటాడు.

పారాగ్లైడింగ్‌కు వెళ్లిన దంపతులు.. ఆకాశంలో భార్య వింత ప్రవర్తన.. నవ్వులు పూయిస్తున్న వీడియో


దీంతో ఆ దొంగ కిటికీ ఊచల మధ్యలో నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లింది.. కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. ఎంతో నైపుణ్యంతో కిటికీ ఊచల మధ్య నుంచి అతడు వెళ్లే విధానం అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ దొంగ తెలివితేటలపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ టాలెంట్ ఏదో మంచి పనులకు ఉపయోగించాలని కొందరు సలహా ఇస్తున్నారు.

రైలు దగ్గరికి వస్తుందనగా మహిళను పట్టాల మీదకు తోసేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే..



Updated Date - 2022-01-20T00:16:50+05:30 IST