తీవ్ర ఇన్ఫెక్షన్‌కు కళ్లెం వేసే 4-పీబీఏ

ABN , First Publish Date - 2020-09-21T06:52:19+05:30 IST

శరీర జీవక్రియలతో ముడిపడిన యూరియా సైకిల్‌ రుగ్మతల చికిత్సకు వాడే ఓ ఔషధంతో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌ను అదుపులోకి తేవచ్చని కాలిఫోర్నియా లాస్‌ఏంజెలెస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు...

తీవ్ర ఇన్ఫెక్షన్‌కు కళ్లెం వేసే 4-పీబీఏ

వాషింగ్టన్‌, సెప్టెంబరు 20: శరీర జీవక్రియలతో ముడిపడిన యూరియా సైకిల్‌ రుగ్మతల చికిత్సకు వాడే ఓ ఔషధంతో తీవ్ర కరోనా ఇన్ఫెక్షన్‌ను అదుపులోకి తేవచ్చని కాలిఫోర్నియా లాస్‌ఏంజెలెస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. 4-ఫినైబ్యూటిరిక్‌ యాసిడ్‌ (4-పీబీఏ) అనే ఔషధాన్ని కరోనా ఇన్ఫెక్షన్‌ కలిగిన జంతువులపై పరీక్షించగా, వాటిలో పరిమితికి మించి సైటోకైన్‌లు విడుదలయ్యే దుష్పరిణామానికి చెక్‌ పడింది. దీంతో సైటోకైన్‌ స్టార్మ్‌ రూపంలో ఎదురయ్యే పెనుముప్పు నుంచి అవి బయటపడ్డాయి. జీవకణాలు ఒత్తిడిలో ఉన్నాయనేందుకు తార్కాణంగా నిలిచే రక్తంలోని బైండింగ్‌ ఇమ్యునోగ్లోబులిన్‌ ప్రొటీన్‌ మోతాదును గుర్తించి, తగిన చికిత్స అందించేందుకూ ఈ ఔషధం ఉపయోగపడిందని వెల్లడించారు.


Updated Date - 2020-09-21T06:52:19+05:30 IST