ఒకటి నుంచి విమానాశ్రయంలో నూతన పార్కింగ్‌ విధానం

ABN , First Publish Date - 2020-02-28T11:30:36+05:30 IST

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మార్గదర్శకాల ప్రకారం మార్చి ఒకటో తేది నుంచి నూతన పార్కింగ్‌ విధానం అమలు చేస్తున్నట్లు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్‌ ఎస్‌.సురేష్‌ గురువారం తెలిపారు.

ఒకటి నుంచి విమానాశ్రయంలో నూతన పార్కింగ్‌ విధానం

రేణిగుంట, ఫిబ్రవరి 27: ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మార్గదర్శకాల ప్రకారం మార్చి ఒకటో తేది నుంచి నూతన పార్కింగ్‌ విధానం అమలు చేస్తున్నట్లు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్‌ ఎస్‌.సురేష్‌ గురువారం తెలిపారు. పార్కింగ్‌ కాంట్రాక్ట్‌ నిర్వహణ పనులు ఒమేగా ఎంటర్‌ప్రైజెస్‌ వారు చూస్తారన్నారు. ప్రతి 30 నిమిషాలు, రెండు గంటలకు ఒక రేటు, ఆపై ఏడు, 24 గంటల వరకు మరో రేటు ఉంటుందని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు మొదటి 30 నిమిషాలకు రూ.10, రెండు గంటల వరకు రూ.15, ఆతర్వాత ప్రతి అదనపు గంటకు రూ.5 అధికంగా ఏడు గంటల వరకు, 24 గంటలకు రూ.45 వసూలు చేస్తారన్నారు. కారు, టెంపో, మినీబస్సు, ఎస్‌యూవీ వాహనాలకు 30 నిమిషాలకు రూ.20, రెండు గంటల వరకు రూ.35, అదనపు ప్రతి గంటకు రూ.10 అధికంగా ఏడు గంటల వరకు, 24 గంటలకు రూ.105, బస్సు, ట్రక్‌లకు 30 నిమిషాలకు రూ.20, రెండు గంటల వరకు రూ.35, అదనపు ప్రతి గంటకు రూ.10 ఏడు గంటల వరకు, 24 గంటలకు రూ.150 చొప్పున వసూలు చేస్తారని వివరించారు. తమకు కేటాయించిన స్థలాల్లో వాహనదారులు పార్క్‌ చేయాలని, అతిక్రమిస్తే ఏఏఐ నిబంధనల మేరకు జరిమానా తప్పదని హెచ్చరించారు. 

Updated Date - 2020-02-28T11:30:36+05:30 IST