ప్రెస్‌మీట్‌లో శృంగారం గురించి ప్రశ్న.. న్యూజిలాండ్ ప్రధాని షాకింగ్ రియాక్షన్.. నెట్టింట వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-09-10T20:43:19+05:30 IST

ప్రపంచమంతా కరోనా మహమ్మారి కారణంగా అల్లకల్లోలం అవుతుంటే న్యూజిలాండ్ మాత్రం దానిని సమర్థంగా ఎదుర్కొంది.

ప్రెస్‌మీట్‌లో శృంగారం గురించి ప్రశ్న.. న్యూజిలాండ్ ప్రధాని షాకింగ్ రియాక్షన్.. నెట్టింట వీడియో వైరల్

ప్రపంచమంతా కరోనా మహమ్మారి కారణంగా అల్లకల్లోలం అవుతుంటే న్యూజిలాండ్ మాత్రం దానిని సమర్థంగా ఎదుర్కొంది. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేసి కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించిన ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్‌పై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా కరోనా మహమ్మారి విషయమై ఆమె ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఆ దేశ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్ ఫీల్డ్ కూడా పాల్గొన్నారు. 




ఆ సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రధాని షాకయ్యారు. అనంతరం తేరుకుని సమాధానం చెప్పారు. `అక్లాండ్‌లోని హాస్పిటల్‌లో కోవిడ్ చికిత్స పొందుతున్న రోగిని చూసేందుకు వచ్చిన మహిళ.. అతనితో శృంగారంలో పాల్గొందని వార్తలు వచ్చాయి. అది అత్యంత ప్రమాదకరం కదా` అని అడిగారు. ఆ ప్రశ్న విన్న తర్వాత ప్రధాని జసిండా షాకయ్యారు. అనంతరం తేరుకుని.. `కరోనా పరిస్థితుల్లోనే కాదు.. సాధారణ పరిస్థితుల్లో కూడా హాస్పిటల్‌లో అలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడద`ని సమాధానమిచ్చారు. కాగా, ఆ ప్రశ్నకు ఆమె షాకింగ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  

Updated Date - 2021-09-10T20:43:19+05:30 IST