సీఎం స్టాలిన్‌కు ఆంధ్రా విద్యార్థి విన్నపం.. కాన్వాయ్‌ ఆపి మరీ..

ABN , First Publish Date - 2022-02-04T09:23:01+05:30 IST

‘సార్‌.. నేను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా వాసిని...

సీఎం స్టాలిన్‌కు ఆంధ్రా విద్యార్థి విన్నపం.. కాన్వాయ్‌ ఆపి మరీ..

  • ముచ్చటించిన సీఎం
  • ‘నీట్‌’ నుంచి విముక్తి కల్పించండి సార్‌


చెన్నై, ఫిబ్రవరి 3 (ఆంధ్రప్రదేశ్‌): నీట్‌ ప్రవేశ పరీక్ష నుంచి దేశానికి విముక్తి కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి తమిళనాడు సీఎం స్టాలిన్‌కు విన్నవించారు.  సీఎం స్టాలిన్‌ సచివాలయానికి వెళ్తుండగా.. ఎన్‌.సతీ్‌ష అనే విద్యార్థి ‘సీఎం సార్‌.. హెల్ప్‌ మీ’ అనే ప్లకార్డుతో రోడ్డు పక్కన నిల్చున్నాడు. సీఎం.. కాన్వాయ్‌ ఆపి ఆ విద్యార్థిని దగ్గరకు పిలిచారు. ‘సార్‌.. నేను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా వాసిని. ప్లస్‌టూలో మంచి మార్కులు సాధించినా, నీట్‌ ప్రవేశ పరీక్ష కారణంగా వైద్య కోర్సులో చేరలేకపోయాను. నీట్‌ రద్దు కోసం మీ ప్రభుత్వం ఎంతో పోరాడుతోంది. మీ మద్దతు మా రాష్ట్రానికీ కావాలి. నీట్‌ నుంచి ఒక్క తమిళనాడుకే కాకుండా దేశం మొత్తానికి విముక్తి కల్పించండి సార్‌’ అంటూ చేతులెత్తి మొక్కాడు. అయితే,  ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్‌ తిప్పిపంపడం గమనార్హం.

Updated Date - 2022-02-04T09:23:01+05:30 IST