జిల్లాలో ఎన్‌ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2022-09-19T05:55:59+05:30 IST

జిల్లా కేంద్రంలో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారులు ఉగ్ర లింకులపై హఠాత్తుగా సోదాలు నిర్వహించడం జిల్లాలో కలకలం రేపుతోంది.

జిల్లాలో ఎన్‌ఐఏ సోదాలు
జిల్లా జైలులోకి వెళ్తున్న ఎన్‌ఐఏ అధికారుల బృందం

కలకలం రేపిన ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

జిల్లా కేంద్రంలో అనుమానిత వ్యక్తిని  అదుపులోకి తీసుకుని విచారణ

మరిన్ని లింకులపై రహస్యంగా ఆరా

అప్రమత్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం

ఆదిలాబాద్‌, సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారులు ఉగ్ర లింకులపై హఠాత్తుగా సోదాలు నిర్వహించడం జిల్లాలో కలకలం రేపుతోంది. నిజా మాబాద్‌, నిర్మల్‌ జిల్లా భైంసాలో కొందరు అనుమా నిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా జిల్లా లింకులు బయటపడ్డట్లు తెలిసింది. దీంతో ఆదివారం ఉద యం నుంచి ఎన్‌ఐఏ అధికారుల బృందాలు జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌, జిల్లా జైళ్లల్లో సోదాలు నిర్వ హించారు. నిజా మాబాద్‌ జిల్లా నుంచి గతేడాది క్రితం జిల్లాకు వచ్చి నివాసం ఉంటున్న మహ్మద్‌ ఫిరోజ్‌ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధి కారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలు స్తోంది. నిషేదిత పీఎఫ్‌ఐ (పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా)అనే సంస్థ ద్వారా శిక్షణ తీసుకుని జిల్లా లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తు న్నారన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. గతం లోనే మందుగుండు సామగ్రిని తరలిస్తూ హర్యానా పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల వద్ద ఆదిలాబా ద్‌ లొకేషన్‌ మ్యాప్‌ ఉన్నట్లు గుర్తించడం అనుమా నాలకు దారి తీసింది. దీంతో నిఘా వర్గాలు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పట్లోనే రహస్యం గా సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ వర్గాలు ఎలాంటి ఆధారాలు దొరకక పోవడంతో కొంత సైలెంటై పోయారు. అయినా అప్పటి నుంచి జిల్లాపై కన్నేసిన ఎన్‌ఐఏ అధికారులు తాజాగా మెరుపుదా డులు చేసి ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అదుపులోకి తీసు కున్న వ్యక్తిని విచారణ నిమిత్తం హైదరాబాద్‌ లేక ఢిల్లీకి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌ఐఏ అధికారుల దాడులతో అప్రమ త్తమైన జిల్లా పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టిబందో బస్తును నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘాను సారిస్తున్నారు.

పోలీసు అధికారి ఇంట్లోనే మకాం..

నిజామాబాద్‌ జిల్లా నుంచి బతుకుదెరువు కోసం తనతల్లితో పాటు ఏడాది క్రితం జిల్లాకు వచ్చిన మహ్మద్‌ఫిరోజ్‌ ఎవరికి అనుమానం రాకుండా ఓ పోలీసు అధికారి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నట్లు తెలు స్తోంది. కొంత కాలం క్రితమే ఫిరోజ్‌కు ఉట్నూర్‌ మండలానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగిం ది. దీంతో వారి బంధువులు ఉంటున్న ఇంట్లోనే ఫిరో జ్‌ అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. ఇక్కడే ఉంటూ పీఎఫ్‌ఐ సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. రహస్యంగా వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పీఎఫ్‌ఐ  సంస్థ ఇచ్చిన శిక్షణ తీసుకుని పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ఉసిగొల్పు తున్నట్లు అనుమాని స్తున్నారు. ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్న అనం తరం ఎన్‌ఐఏ అధికారులు జిల్లా జైలుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ మరి కొంత మంది నిందితులను విచారించినట్లు ప్రచారం జరుగుతుంది.కాని ఎన్‌ఐఏ అధికారుల బృందానికి టీం లీడర్‌గా పని చేస్తున్న ఓ అధికారి జైళ్ల శాఖ నుంచే డిప్యూటేషన్‌పై గత కొంత కాలంగా ఎన్‌ఐఏ సంస్థలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కొంత విశ్రాంతి తీసుకునేం దుకు జిల్లా జైలుకు వచ్చినట్లు జైలు అధికారులు పేర్కొం టున్నారు. జైల్‌లో ఎవరిని విచారించలేదని కేవలం టీ, బిస్కెట్‌ తీసుకుని వెళ్లి పోయారని జైలు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరికొన్ని చోట్ల రహస్యంగా..

జిల్లాకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు మరికొన్ని చోట్ల రహస్యంగా సోదాలు నిర్వహించినట్లు తెలు స్తోంది. అనుమానితుడిగా భావిస్తున్న మహ్మద్‌ ఫిరోజ్‌ నుంచి ఓ కంప్యూటర్‌ ల్యాప్‌టాప్‌, హార్డ్‌వేర్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమా  చారం. జిల్లా కేంద్రంతో పాటు పట్టణ పరిసర ప్రాం తంలోని మరికొన్ని దాబా హోటళ్లలోను ఎన్‌ఐఏ అధి కారుల బృందం తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న అనుమానితుని ద్వారా మరి న్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చా రనే దానిపై ఆరా తీస్తున్నారు. ఫిరోజ్‌ కాంటాక్ట్‌లపై రహస్య విచారణ జరుపుతున్నారు. త్వ రలోనే మరికొంత మంది అను మానితుల ను గుర్తించే అవకాశం ఉన్నట్లు చెబుతు న్నారు. జిల్లా కేంద్రం నుంచే మహారాష్ట్ర తదితర ప్రాం తాలకు ఉగ్ర కార్యకలాపాలను కొనసాగిస్తున్న ట్లు అఽ దికారులు అంచనా వేస్తున్నారు. గతంలోనే ఆదిలాబా ద్‌ లోకేషన్‌ గుర్తించిన అధికారులు అప్పటి నుంచి మరింత నిఘాను పెంచారు. అయితే అనుమానిత నిందితున్ని అదుపులోకి తీసుకునేంత వరకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకే సమాచారం లేక పోవడం ఆశ్చార్యానికి గురి చేస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే నిఘా వర్గాల పని తీరు అర్థమవుతోంది. ముందుగా ఊహించినట్లుగానే ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తు న్నారన్న అనుమానంతో జిల్లాలో ఒకరిని అదుపులోకి తీసుకోవడం ప్ర స్తుతం హాట్‌ టాపి క్‌గా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుం దోనన్న భయాందోళన వ్యక్తమ వుతోంది. మొత్తానికి ఉగ్రమూలాలు బయట పడడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2022-09-19T05:55:59+05:30 IST