Abn logo
Mar 2 2021 @ 00:09AM

‘చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం దారుణం’

నిడదవోలు, మార్చి 1:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారా వు అన్నారు. నిడదవోలు సుబ్బరాజుపేటలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటువంటి దుర్మార్గపు అణచితే విధానాలను ప్రజలు మున్సిప ల్‌ ఎన్నికల ద్వారా తిప్పి కొట్టాలని విమర్శించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతోనే రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్నారన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, కొమ్మిన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


ఓటమి భయంతోనే నిర్బంధం : ఆరిమిల్లి

తణుకు, మార్చి 1 : ఓటమి భయంతోనే ప్రతిపక్ష నేతను ప్రజల్లోకి వెళ్లనీయకుండా వైసీపీ అడ్డుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించడం చట్ట వ్యతిరేకమన్నారు. వేల్పూరు పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన నిరసన తెలిపారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకున్నా ఈ విధంగా అడ్డుకోవడం తగదన్నారు. వైసీపీ నియంతృత్వ విధానాలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.

తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి నిరసన


Advertisement
Advertisement
Advertisement