నందనంలో నీరా ప్లాంటు

ABN , First Publish Date - 2021-12-04T06:14:04+05:30 IST

ప్రజలకు ఆరోగ్యకరమైన నీరా అందించే ఉద్దేశ్యంతో భువనగిరి మండలం నందనం గ్రామశివారులో 4 నీరా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నందనంలో నీరా ప్లాంటు
నందనంలోని తాటి ఉత్పత్తుల కేంద్రం

 ప్లాంటు ఏర్పాటుకు రూ.8 కోట్లు మంజూరు 

 ప్రకృతి సిద్ధమైన కల్లును ప్రాసెస్‌ చేసి తాటి ఉత్పత్తులు

 కల్తీ కల్లు నివారణ, గీత కార్మికుల ప్రయోజనమే లక్ష్యం 

భువనగిరిరూరల్‌, డిసెంబరు 3: ప్రజలకు ఆరోగ్యకరమైన నీరా అందించే ఉద్దేశ్యంతో భువనగిరి మండలం నందనం గ్రామశివారులో 4 నీరా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.8కోట్ల నిధులను మంజూరు చే సిం ది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గీత కార్మికుల జీవనస్థితి గతులు మెరుగుపడే అవకాశం ఉంది. ప్రకృతి సిద్దమైన పానీయాన్ని నిల్వ ఉండే విధంగా శాస్త్రీయ ప్రాసెస్‌ చేసి బాట్లింగ్‌ చేయనున్నా రు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ సమీపంలో ఇప్పటికే నీరా పార్లర్‌ను ఏర్పాటు చేసి విక్రయాలు ప్రారంభించారు. త్వరలోనే రా ష్ట్రంలో పలు ప్రధాన పట్టణాల్లో సైతం నీరాను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ నేపద్యంలోనే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నీరా బాటిల్స్‌తో పాటు పలు తాటి ఉత్పత్తుల సరఫరాకు యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలోని తాటి ఉత్పత్తుల కేం ద్రంలో నీరా ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిం ది. ఈ ప్రాంతంలోని గీత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఆధునిక యంత్ర పరికరాలతో... 

నందనం గ్రామంలో రూ. 70లక్షల అంచనా వ్యయంతో 1993 నవంబ రు 13వ తేదీన అప్పటి ఎక్సైజ్‌, ప్రొబెషినరీ శాఖ మంత్రి గాదె వెంకట్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కుందూరు జానారెడ్డి తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. దశాబ్దాలుగా మూతపడిన నందనం తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కేంద్రాన్ని పూర్తిగా నవీకరించి ఆధునిక యంత్రాలతో ప్లాంటు ఏర్పాటు చే యనున్నారు. తాటివనాలు అధికంగా గల ఈ ప్రాంతంలో ఉదయం 6 గంటలలోపు సూర్యకిరణాలే పడని కల్లును సేకరించి, ఈ ప్లాంట్లులో నీ రాగా ప్రాసెస్‌ చేయడానికి ఆదునిక యంత్ర పరికరాలను సమకూర్చనున్నారు. కోల్డ్‌ స్టోరేజీ యూనిట్‌తో పాటు ఇతర తాటి ఉత్పత్తుల తయారీకి అవసరమైన యంత్ర పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ ఉత్ప త్తి చేసిన నీరా, తాటి ఉత్పత్తులను హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌లోని నీరా పార్లర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయబోయే వాటికి సరఫరా చేయనున్నారు. ఈ ఏడాది జూలైలో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ భువనగిరి మండలం వడాయిగూడెంలో పర్యటించా రు. ఈ నేపథ్యంలో మండలంలోని నందనంలో మూతపడిన తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని పునరుద్ధరించాలని, నీరా ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీ సుకోవాలని గీత కార్మికులు విజ్ఞప్తి చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 6 నె లల్లో నీరా ప్లాంట్‌కు నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని  హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశాలతో నీరా ప్రాజెక్టు ఏర్పాటకు నీ రా పాలసీ అధ్యయన కమిటీ సభ్యుడు, సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ దత్తరాజ్‌గౌడ్‌ ఇటీవల నందనం సందర్శించారు. ఎక్సైజ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేర కు ప్రాజెక్టు రిపోర్టును పరిశీలించిన రాష్ట్రస్థాయి అధికారులు ఎట్టకేలకు రూ.8 కోట్ల నిధులను మంజూరు చేశారు. 







Updated Date - 2021-12-04T06:14:04+05:30 IST