నారింజ రంగు చేనేత చీర ధరించిన నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2022-02-01T16:31:36+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సందర్భాన్నిబట్టి

నారింజ రంగు చేనేత చీర ధరించిన నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సందర్భాన్నిబట్టి ధరించే వస్త్రాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ఆమెకు చేనేత, పట్టు చీరలంటే చాలా ఇష్టమనే సంగతి అందరికీ తెలుసు. మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంలో ఆమె నారింజ రంగు చేనేత చీరను ధరించారు. చక్కని బంగారు రంగు జరీ అంచు బోర్డర్ గల ఈ చీర చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో దీనిని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు సమర్పిస్తారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిర్మల సీతారామన్ కాగితం రహిత బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 


Updated Date - 2022-02-01T16:31:36+05:30 IST