Abn logo
Apr 19 2021 @ 21:53PM

మండుతున్న ఎండలతో నిర్మానుష్యంగా రోడ్లు

ముత్తుకూరు, ఏప్రిల్‌19: ఏప్రిల్‌లో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం తొమ్మిది నుంచే ఎండలు మండుతున్నాయి. చురుక్కుమనిపించే భానుడి కిరణాల తాకిడికి రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం జనసంచారంతో, వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ముత్తుకూరు రోడ్డు సోమవారం మద్యాహ్నం నిర్మానుష్యంగా కనిపించింది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులతో సందడిగా కనిపించే ముత్తుకూరు రహదారులు వెలవెలబోయాయి. చెరుకు రసం, పుచ్చకాయలు, జ్యూస్‌లతో వేసవి తాపాన్ని తీర్చుకుంటుండడంతో ఆయా వ్యాపారాలు జోరందుకున్నాయి. ఏప్రిల్‌లోనే ఎండలు మండుతుంటే రాబోయే రోజుల్లో వేసవి తీవ్రతను తలచుకుంటేనే ‘వడదెబ్బ‘ తగిలేలా ఉంది. 


Advertisement
Advertisement
Advertisement