Abn logo
Nov 28 2020 @ 00:18AM

నిలువునా ముంచిన ‘నివర్‌’

బద్వేలు,నవంబరు 2: పదేళ్ల కాలంలో కనీవినీ ఎరుగని విపత్తు. కాయకష్టం కళ్లముందే కరిగిపోయింది. చేతికందాల్సిన సమయంలో వరి ‘నివర్‌’ ప్రభావంతో వర్షార్పణమైంది. బద్వేలు డివిజన్‌లో వందల ఎకరాల్లో రైతులకు నష్టంవాటిల్లింది.  పలు ప్రాంతాల్లో

మండలాలవారీగా నష్టం..

బద్వేలు మండలంలో 368 ఎకరాలు, బి.కోడూరులో 3200 ఎకరాలు, కలసపాడు మండలంలో 1000, అట్లూరు మండలంలో 300, పోరుమామిళ్ల మండలంలో 661, కాశినాయన మండలంలో 900 ఎకరాలు, గోపవరం మండలంలో 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. 

ఉగ్రరూపం దాల్చిన పాపాఘ్ని.. భారీగా పంట నష్టం

చక్రాయపేట, నవంబరు 27: చక్రాయపేట మండలంలో ప్రవహించే పాపాఘ్ని ఉధృతి వల్ల వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. సుమారు కోటి రూపాయలకు పైబడి రైతులు నష్టపోయారు. కుప్పం, రాచుపల్లె, కుమార్లకాల్వ, అద్దాలమర్రి, మారెళ్లమడక, కొండవాండ్లపల్లె, తిమ్మారెడ్డిగారిపల్లె గ్రామాల ప్రాంతాలలో వేలాది ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. కుప్పం కాజ్వేపై దాదాపు 10 అడుగుల ఎత్తులో నది ప్రవహించింది. అలాగే అద్దాలమర్రి వద్దనున్న బ్రిడ్జిపై కూడా దాదాపు ఐదారుఅడుగులపైన ప్రవహించడంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పులివెందుల రూరల్‌ సీఐ రవీంద్రనాథరెడ్డి పర్యవేక్షించారు. అలాగే తహసీల్దార్‌ సత్యానందం పాపాఘ్ని నది పరివాహక ప్రాంతంలో పంటను పరిశీలించడంతో పాటు చెరువులను పరిశీలించారు. కాగా గండి క్షేత్రం వద్ద 16 మెట్ల వరకు పాపాఘ్ని ప్రవహించింది. 

Advertisement
Advertisement
Advertisement