ఎల్‌ఆర్‌ఎస్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-24T11:59:35+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ అదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో

ఎల్‌ఆర్‌ఎస్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలి

కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమే్‌షకుమార్‌ 


భువనగిరిరూరల్‌/నల్లగొండటౌన్‌/సూర్యాపేట(కలెక్ట రేట్‌), సెప్టెంబరు 23: ఎల్‌ఆర్‌ఎస్‌ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ అదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పల్లె ప్రకృతి వనాలు, వీధి వ్యాపారుల రుణాలు, రైతు వేదికలు, పట్టణ ప్రగతి, నర్సరీలు, కస్టం మిల్లింగ్‌ (సీఎంఆర్‌), తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు.


సీఎంఆర్‌ లక్ష్యాన్ని వారం రోజుల్లోగా పూర్తిచేయాలని, రైతు వేదికల నిర్మాణా ల క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. పల్లె ప్రగతిలో ప్రతి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ పొందినందున మొక్కల సంరక్షణ, పారిశుధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి భాగస్వామ్యంతో పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 2021సంవత్సరంలో మొక్కలు నాటేందుకు కావాల్సిన నర్సరీల వివరాలపై యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలన్నారు.


కాన్ఫరెన్స్‌లో యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు అనితా రామచంద్రన్‌, ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, వినయ్‌ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు డి.శ్రీనివా్‌సరెడ్డి, ఎన్‌ ఖీమ్యానాయక్‌,  రాహుల్‌శర్మ, చంద్రశేఖర్‌, పద్మజారాణి, ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్లు,  ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T11:59:35+05:30 IST