ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాల్లో ఖచ్చితత్వం లేదు..!

ABN , First Publish Date - 2020-05-28T18:37:03+05:30 IST

కరోనా నిర్ధారణకు నిర్వహిస్తున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాల్లో ఖచ్చితత్వం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాల్లో ఖచ్చితత్వం లేదు..!

కరోనా నిర్ధారణకు నిర్వహిస్తున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాల్లో ఖచ్చితత్వం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని వేళల ఈ టెస్టు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తుందన్న భరోసా లేదని తాజా అధ్యయనమొకటి తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది నిపుణులు ఆర్టీపీసీఆర్ పరీక్షను అనుసరిస్తున్నారు. వ్యక్తుల్లో వైరస్ ప్రవేశించిన తర్వాత ఏ రోజు పరీక్ష చేస్తున్నామనేదాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటున్నట్లు వెల్లడించింది. 


అమెరికాలోని జాన్స్ హాప్‌కీన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యనం ప్రకారం వైరస్ సోకినప్పటికీ దాని ఉనికిని ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్ధారించలేని కేసులు 20 శాతం కంటే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా వైరస్ బారిన పడిన తర్వాత పరీక్ష నిర్వహించే సమయాన్ని బట్టి ఖచ్చితత్వం మారుతోంది. ఇన్ఫెక్షన్‌కు గురైన రోజు వైరస్ ఉనికికి ఈ పరీక్ష ఏ మాత్రం గుర్తించడంలేదు. వైరస్ సోకిన తర్వాత నాల్గో రోజు కూడా నెగిటీవ్ అని వచ్చే అవకాశం 67 శాతం ఉంటోంది. అలాంటి తప్పు ఫలితం వచ్చే ముప్పు.. 8వ రోజు నాటికి 20 శాతానికి తగ్గుతోంది. ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తుల్లో వ్యాధిలక్షణాలు కనిపించడం మొదలయ్యాక కూడా నెగిటివ్ అని పరీక్షల్లో తేలే అవకాశం 38 శాతం ఉంటోంది. ఇక 9వ రోజు నుంచి 31 వ రోజు వరకు పరీక్ష చేస్తూ పోతే వైరస్ లేదని ఫలితం వచ్చే శాతం 21 శాతం నుంచి 66 శాతానికి పెరుగుతూ పోతోంది. భారత్‌లో కరోనా సోకినప్పటికీ చాలా మందిలో లక్షణాలు కనిపించడంలేదు. ఇప్పుడు ప్రస్తుతం చాలా కేసుల్లో ఈ విషయం బయటపడింది. సాధారణంగా 14 రోజుల్లో వైరస్ లక్షణాలు బయటపడాలి, కానీ నెల రోజుల వరకు లక్షణాలు బయటపడడంలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated Date - 2020-05-28T18:37:03+05:30 IST